Megastar Chiranjeevi : రెండు భాగాలుగా మెగా 156.. రెండో భాగంలో మెగా ట్విస్ట్.. గూస్ బంప్స్ స్టఫ్..!

Megastar Chiranjeevi మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమా బింబిసార ఫేం వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న

Published By: HashtagU Telugu Desk
Mega 156 Two Parts Planing Megastar Chiranjeevi Vasishta

Mega 156 Two Parts Planing Megastar Chiranjeevi Vasishta

Megastar Chiranjeevi మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమా బింబిసార ఫేం వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా చిరు నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి (Jagadekaveerudu Athiloka Sundari)కి దగ్గరగా ఉంటుందని టాక్. సినిమాలో హీరోయిన్ గా ఎవరన్నది ఇంకా ఫైనల్ అవలేదు. మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) పేరు పరిశీలనలో ఉందని తెలుస్తుంది.

సైన్స్ ఫిక్షన్ కథతో వస్తున్న ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ మెగా ఫ్యాన్స్ ని అలరిస్తుంది. సినిమాని దర్శక నిర్మాతలు రెండు భాగాలుగా తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారట. ఈమధ్య మెగాస్టార్ (Megastar) సినిమాలు ఫ్యాన్స్ ని నిరాశపరుస్తున్నాయి. అందుకే ఈసారి సినిమా తన స్టామినా చూపించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారట.

చిరు సినిమా రెండు పార్టులు అని టాక్ రాగానే మెగా ఫ్యాన్స్ లో సినిమాపై సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. కొన్నాళ్లుగా రీమేక్ సినిమాలతో ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేస్తున్న చిరు ఈ సినిమాతో మెగా హిట్ టార్గెట్ పెట్టుకున్నారు. అందుకే సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. మెగా ఫ్యాన్స్ అంతా కూడా సర్ ప్రైజ్ అయ్యేలా ఈ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తుంది.

Also Read : Priyanka Arul Mohan : అందరు ఆ హీరోయిన్ వెంట పడుతున్నారే.. టాలీవుడ్ లో సత్తా చాటుతున్న ముద్దుగుమ్మ..!

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 29 Oct 2023, 04:06 PM IST