Site icon HashtagU Telugu

Meenakshi Chaudhary : బాపు బొమ్మగా మీనాక్షి చౌదరి.. శారీ లుక్ తో కెవ్వు కేక..!

Meenakshi Chaudhary Latest Saree Photoshoot

Meenakshi Chaudhary Latest Saree Photoshoot

Meenakshi Chaudhary టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో ఆడియన్స్ అటెన్షన్ ని దక్కించుకుంటుంది మీనాక్షి చౌదరి. సుశాంత్ తో నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అమ్మడు వరుస సినిమాలు చేస్తూ మెప్పించింది. ఖిలాడి, హిట్ 2 ఇలా తనకు వచ్చిన ప్రతి ఛాన్స్ చేస్తూ వస్తున్న మీనాక్షి గుంటూరు కారం లో మహేష్ మరదలిగా నటించి మెప్పించింది. సినిమాలో ఆమెది చిన్న పాత్రే అయినా మీనాక్షి ఫ్యాన్స్ ఆమెను ఇష్టపడ్డారు.

ఇక ఇప్పుడు వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో వస్తుంది మీనాక్షి చౌదరి. ఆల్రెడీ కోలీవుడ్ లో దళపతి విజయ్ తో గోట్ సినిమా చేస్తున్న అమ్మడు తెలుగులో వరుణ్ తేజ్ మట్కా చేస్తుంది. విక్టరీ వెంకటేష్ తో అనీల్ రావిపుడి చేస్తున్న సినిమాలో కూడా మీనాక్షి నటిస్తుందని టాక్. అయితే ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వరుస ఫోటో షూట్స్ తో కవ్విస్తుంది అమ్మడు.

గ్లామర్ షో కాస్త ఆచి తూచి అడుగులేస్తున్న మీనాక్షి తన క్లాసిక్ లుక్స్ తో ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు శారీ లుక్ లో దిగిన ఫోటోస్ అయితే ఆడియన్స్ ని పిచ్చెక్కిస్తున్నాయి. ఫోటో షూట్స్ అంటే గ్లామర్ షో అనేలా కొందరు చేస్తుండగా శారీ లుక్ లో అదుర్స్ అనిపించేస్తుంది మీనాక్షి. బాపు బొమ్మగా.. మణిరత్నం హీరోయిన్ లా మీనాక్షి అందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవంటే నమ్మాల్సిందే.

తన మార్క్ ఫోటో షూట్స్ తో అలరిస్తున్న మీనాక్షి లేటెస్ట్ గా ఈ శారీ లుక్స్ తో సర్ ప్రైజ్ చేసింది. స్టార్ మెటీరియల్ అయిన ఈ అమ్మడికి వరుసగా రెండు హిట్లు పడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు. మీనాక్షి లేటెస్ట్ ఫోటో షూట్ ఆడియన్స్ ని ఫిదా చేస్తున్నాయి.

Also Read : Dhanush Raayan : కమల్ ఆగిపోతే ధనుష్ రంగంలోకి దిగుతున్నాడా..?