శ్రీ లీల తర్వాత టాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ ఫాం లో ఉన్న మరో భామ ఎవరంటే మీనాక్షి చౌదరి అనే చెప్పొచ్చు. సుశాంత్ ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అమ్మడు ఆ సినిమాతో ఇంప్రెస్ చేయగా హిట్ 2 తో సక్సెస్ అందుకుంది Meenakshi Chaudary. మహేష్ (Mahesh) తో గుంటూరు కారం సినిమా ఛాన్స్ అందుకున్న మీనాక్షి ఆ ఛాన్స్ తో గ్రాఫ్ పెంచేసుకుంది. సినిమాలో ఆమెది ఎలాంటి పాత్ర అన్నది తెలియకముందే మహేష్ గుంటూరు కారం లో చేస్తుందని తెలియగానే ఆమె కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.
ఇప్పటికే తెలుగులో వరుణ్ తేజ్ (Varun Tej) మట్కాతో పాటుగా విశ్వక్ సేన్ సినిమాలో కూడా నటిస్తుంది అమ్మడు. ఈ సినిమాల తర్వాత కోలీవుడ్ లో కూడా క్రేజీ ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ తమిళ్ లో సింగపూర్ సెలూన్ సినిమా చేస్తున్న మీనాక్షి లేటెస్ట్ గా దళపతి విజయ్ (Vijay) సినిమాలో నటిస్తుంది. విజయ్ ఆంటోని తో కోలై సినిమా చేసిన మీనాక్షి ఆ సినిమాతో అక్కడ పర్వాలేదు అనిపించుకుంది.
ఇప్పుడు ఏకంగా విజయ్ లాంటి స్టార్ హీరో సినిమాలో అవకాశం దక్కించుకుంది. విజయ్ 68వ సినిమా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరెవరి పేర్లో వినిపించగా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudary) పేరు ఫైనల్ అయినట్టు తెలుస్తుంది.
కోలీవుడ్ లో విజయ్.. తెలుగులో మహేష్ ఇద్దరు పెద్ద స్టార్స్ తో నటిస్తున్న మీనాక్షి తప్పకుండా సౌత్ సెన్సేషనల్ హీరోయిన్ గా మారే అవకాశం ఉందని చెప్పొచ్చు. మీనాక్షి చేస్తున్న ఈ సినిమాలు కూడా సక్సెస్ అయితే టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లే ఛాన్స్ ఉన్నాయని చెప్పొచ్చు.
Also Read : Gandhi Jayanthi : గాంధీని స్మరిస్తూ విస్మరిస్తున్నాం..