మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwaksen ) హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తో సూపర్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో..ఇప్పుడు మెకానిక్ రాకీ (Mechanic Rocky) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి (Ravi Teja Mullapudi) దర్శకత్వంలో ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ మూవీ లో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ (Meenakshi Chaudhary, Shraddha Srinath) హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమా ఫై అంచనాలు పెంచారు. ”ఛోటే-ఛోటే బచ్చోంకే పూరే జవాబ్ దేతీ హూం” అంటూ విశ్వక్ చెప్పే డైలాగ్స్ గ్లింప్స్ కు హైలైట్ గా ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
సినిమాలోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ ఈ గ్లింప్స్ ను కట్ చేసారు. యాక్షన్ & లవ్ ఎంటర్‌టైనర్ గా మూవీ రాబోతుందని అర్ధం అవుతుంది. ఇక ఈ మూవీ లో సునీల్ ఒత్తైన మీసం, జుట్టుతో చాలా సీరియస్‌గా కనిపించారు. ఈయన లుక్ చూస్తుంటే ఈ సినిమాలో ఆయనది విలన్ అనిపిస్తుంది. మరి అది నిజామా కదా అనేది సినిమా రిలీజ్ అవుతూనే కానీ తెలియదు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో నరేష్, సునీల్, ‘వైవా’ హర్ష, హర్ష వర్ధన్, ‘రోడీస్’ రఘు రామ్ వంతి తదితర నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 31 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Read Also : Paris Olympics 2024: షూటర్ మను భాకర్‌కు హర్యానా సీఎం శుభాకాంక్షలు