సందీప్ కిషన్ (Sundeep Kishan), రావు రమేష్ (Rao Ramesh) హీరోలుగా ‘ధమాకా’ వంటి విజయం తర్వాత రచయిత ప్రసన్నకుమార్ బెజవాడ, దర్శకుడు త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina) తీసిన సినిమా ‘మజాకా'(Mazaka ). గత కొంతకాలంగా హిట్ లేని సందీప్..ఈ మూవీ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు. మరి ఆయన ఆశలు నెరవేరాయా..? సినిమా ఎలా ఉంది..? ధమాకా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న త్రినాథరావు మజాకా తో హిట్ అందుకున్నాడా..లేదా..? సినిమా చూసిన పబ్లిక్ ఏమంటున్నారు..? అనేది చూద్దాం.
Maha Shivaratri 2025 : శివరాత్రి రోజు చిలగడదుంప తినాల్సిందే..ఎందుకంటే..!
తండ్రి కొడుకులు తమ ప్రేమను దక్కించుకునేందుకు చేసే ప్రయత్నమే ఈ సినిమా స్టోరీ. సందీప్ కిషన్, రావు రమేశ్, మురళీ శర్మల నటన, ఎమోషనల్, కామెడీ సీన్లు, సొమ్మసిల్లిపోతున్నవే సాంగ్ ఈ సినిమాకు ప్లస్. సాగదీత, స్లో సీన్లు, ఊహించేలా కథ ఉండటం, పెద్దగా ట్విస్టులు లేకపోవడం మైనస్ అంటున్నారు. ఫస్ట్ హాఫ్ వరకు పర్వాలేదు. ఎక్కడా కొత్త సీన్ పడకపోయినా.. నెక్ట్స్ ఏం జరుగుతుందో చెప్పేలా కథనం సాగుతున్నా కూడా ఏమంతా పెద్ద సమస్యగా అనిపించదు. ఇలాంటి కామెడీని, అలాంటి సీన్లను గత కొన్నేళ్లుగా ఆడియెన్స్ చూస్తూనే వస్తున్నాం. ఈ సీన్ భలే ఉందే అని అనిపించేలా మాత్రం ఉండదు. జబర్దస్త్ కామెడీ స్కిట్ల మాదిరి కొన్ని చోట్ల పంచ్‌లు మాత్రం నవ్విస్తాయి. కీలకమైన సెకండాఫ్ దారి తప్పింది. కథలో పస లేక.. ఏం చేయాలో తెలీక.. అక్కడక్కడే కథను తిప్పేశాడనిపిస్తుంది. ఓవరాల్ గా టైటిల్ కు తగ్గట్లు సినిమా మజాకా అనిపించలేకపోయింది అని ఆడియన్స్ అంటున్నారు.
Legislative Council : శాసనమండలి ఎవరి కోసం ? రిజర్వేషన్లు ఉంటాయా ?