Site icon HashtagU Telugu

Mattuvadalara 2 Trailer : మత్తువదలరా 2 ట్రైలర్ టాక్..!

Mattuvadalara 2 Trailer Talk

Mattuvadalara 2 Trailer Talk

Mattuvadalara 2 Trailer Talk ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమాకు సీక్వెల్ అదేఇ చాలా కామన్ అయ్యింది. ఈమధ్య కొన్ని సినిమాలు ఒకేసారి రెండు భాగాలుగా ప్లాన్ చేస్తుంటే కొన్ని సినిమాలు ఆల్రెడీ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాంటి సీక్వెల్ పంథాలోనే వస్తున్న మరో సినిమా మత్తు వదలరా 2 (Mattuvadalara 2). రితేష్ రానా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా లో శ్రీ సింహా లీడ్ రోల్ చేయగా అతని పక్కన దాదాపు లీడ్ రోల్ గానే చేశాడు సత్య. మత్తు వదలరా సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా మత్తువదలరా 2 తెరకెక్కించారు.

రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదగా..

సెప్టెంబర్ 13న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ని లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) చేతుల మీదగా ఈ ట్రైలర్ రిలీజ్ జరిగింది. ఐతే మత్తువదలరా 2 తో మరోసారి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా డైరెక్టర్ ట్రీట్ మెంట్ బాగుంది. ఫన్ ఫిల్డ్ విత్ సస్పెన్స్ కలిగించేలా సినిమా కథ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ సినిమాకు సత్య, సునీల్ క్యారెక్టర్స్ హైలెట్ అయ్యేలా ఉన్నాయి.

ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ గా ఫరియా అబ్ధుల్లా నటిస్తుంది. మత్తువదలరా 2 ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. సినిమా చూసిన ఆడియన్స్ కు ఒక మంచి ఫన్ రైడ్ అందించేలా ఉన్నారు. టికెట్ కొన్న ఆడియన్స్ కు కావాల్సినంత ఫన్ అందించేందుకు యాక్టర్స్ కృషి చేసినట్టు కనిపిస్తుంది.

ఈమధ్య వరుస సినిమాలు చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాకపోవడంతో హిట్ సినిమా సీక్వెల్ తోనే హిట్ అందుకోవాలని చూస్తున్నాడు శ్రీ సింహా (Sri Simha). తమ్ముడి సినిమాకు అన్న కాళ భైరవ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.