Raviteja : రవితేజ తీసుకున్న మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

ఇన్నాళ్లు తెలుగు ఆడియన్స్ ని మాత్రమే అలరిస్తూ వచ్చిన రవితేజ.. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమాతో పాన్ ఇండియా ఆడియన్స్ ని కూడా పలకరించబోతున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Mass Maharaja Raviteja First Remuneration Details in TFI

Mass Maharaja Raviteja First Remuneration Details in TFI

రవితేజ(Raviteja) ఇండస్ట్రీలో ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మాస్ మహారాజగా ఎదిగాడు. కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా.. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు మాస్ మహారాజ్(Mass Maharaja) గా ఎదిగాడు. ఇన్నాళ్లు తెలుగు ఆడియన్స్ ని మాత్రమే అలరిస్తూ వచ్చిన రవితేజ.. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమాతో పాన్ ఇండియా ఆడియన్స్ ని కూడా పలకరించబోతున్నాడు.

ఇప్పుడు ఒక్కో సినిమాకి కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకునే రవితేజ.. మొదటి రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా..? ఆ పారితోషకాన్ని ఎవరి చేతులు మీదుగా తీసుకున్నాడో తెలుసా..? రవితేజ కెరీర్ విషయానికి వస్తే.. 1990 నుంచి చిన్న చిన్న రోల్స్ చేస్తూ వచ్చాడు. వాటికీ రోజు వారి వేతనం అందుకునేవాడు. అయితే 1996లో ఒక సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. అప్పుడే మొదటిసారి అధికారికంగా రెమ్యూనరేషన్ చెక్ అందుకున్నడు.

కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన ఇండస్ట్రీ హిట్ మూవీ ‘నిన్నే పెళ్ళాడతా’. ఈ సినిమాకి రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఇక ఈ మూవీకి గాను రవితేజ.. నాగార్జున చేతుల మీదుగా మొదటి రెమ్యూనరేషన్ చెక్ ని అందుకున్నాడు. ఆ చిత్రానికి రూ.3500 రెమ్యూనరేషన్ ని రవితేజ తీసుకున్నాడు. ఆ చెక్ ని రవితేజ చాలా ఏళ్ళు దాచుకున్నాడట. అయితే ఒక సమయంలో డబ్బులు లేక.. దానిని బ్యాంకులో డిపాజిట్ చేసి మనీ తీసుకున్నాడట. అలాగే ‘నిన్నే పెళ్ళాడతా’ సినిమాలో రవితేజ ఒక చిన్న పాత్ర కూడా చేశాడు.

 

Also Read : Chiranjeevi : మెగాస్టార్ సూపర్ హిట్ సినిమా రీ రిలీజ్‌కి రెడీ.. థియేటర్స్ లో మోత ఖాయం..

  Last Updated: 15 Oct 2023, 06:50 PM IST