Mass Ka Dass : ఆ గట్స్ విశ్వక్ సేన్ కి మాత్రమే ఉన్నాయి..!

విశ్వక్ (Viswak Sen) డేర్ నెస్ గురించి మరో యువ హీరో అశ్విన్ చెప్పాడు. విశ్వక్ సేన్ గట్స్ కి మెచ్చుకోవాల్సిందే. తను ఏం అనుకుంటున్నాడో అదే మాట్లాడతాడని.. అలా ఉండటం చాలా కష్టమని

Published By: HashtagU Telugu Desk
Viswak Sen Comments on Vijay Setupathi Maharaja Movie

Viswak Sen Comments on Vijay Setupathi Maharaja Movie

Mass Ka Dass యువ హీరోల్లో అనంతికాలం లోనే యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. మాస్ కా దాస్ అనే ట్యాగ్ కి పర్ఫెక్ట్ న్యాయం చేస్తున్నాడు తను చేసే సినిమాలే కాదు మాట్లాడే మాటలు కూడా నో ఫిల్టర్స్ అనేలా ఉంటాయి. ఈ తరం యువ నటుల్లో స్టార్ మెటీరియల్ అంటే అది అతనే అన్నట్టుగా అనిపిస్తుంది. ఏదైనా చేయాలన్న ఆలోచన వస్తే చాలు చేసేద్దాం అనే దూకుడు విశ్వక్ సేన్ కి ఉంటుంది. అందుకే అతని సినిమాలు అలా ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

ఇక విశ్వక్ (Viswak Sen) డేర్ నెస్ గురించి మరో యువ హీరో అశ్విన్ చెప్పాడు. విశ్వక్ సేన్ గట్స్ కి మెచ్చుకోవాల్సిందే. తను ఏం అనుకుంటున్నాడో అదే మాట్లాడతాడని.. అలా ఉండటం చాలా కష్టమని. మాస్ కా దాస్ ట్యాగ్ అతనికి పర్ఫెక్ట్ అని అన్నారు. అంతేకాదు ఈ జెనరేషన్ లో అతను చేస్తున్న సినిమాలు ఎంతో స్పూర్తి అని.. లైలా సినిమా (Laila Movie)లో లేడీ గెటప్ చేయడం అందరికీ సాధ్యం కాదని అన్నాడు అశ్విన్.

అశ్విన్ నటించిన శివం భజే (Shivam Bhaje Trailer) ట్రైలర్ ఈవెంట్ కి విశ్వక్ సేన్ గెస్ట్ గా వచ్చాడు. ఇదే ఈవెంట్ కి మ్యూజిక్ డైరెక్టర్ థమన్, అనీల్ రావిపుడి కూడా అటెండ్ అయ్యారు. విశ్వక్ సేన్ ప్రస్తుతం మెకానిక్ రాక్కీ. లైలా సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో మరోసారి తన మాస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు.

రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ ఆ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఐతే దర్శక నిర్మాతలు మాత్రం అది ప్రాఫిట్ తెచ్చిందని చెబుతున్నారు. ఈ ఏడాది విశ్వక్ సేన్ గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రెండు ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Also Read : Akhil : అఖిల్ పెద్ద పానింగ్ లో భాగంగానే..!

  Last Updated: 24 Jul 2024, 06:58 AM IST