మాస్ మహారాజా రవితేజ (Raviteja) మరోసారి తన స్టైల్‌కి తగ్గ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గతేడాది విడుదలైన ‘ఈగల్’, ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో.. రవితేజకు ఇప్పుడు ఒక భారీ హిట్ అవసరం. తన స్టైల్, ఎనర్జీకి తగిన పాత్రలో నటించాలనే ఆలోచనలో భాగంగా ‘సామజవరగమన’ రచయిత భాను భోగవరపు (Bhanu Bogavarapu) దర్శకత్వంలో ‘మాస్ జాతర’ (Mass Jathara) అనే మూవీ చేస్తున్నాడు. టైటిల్ కు తగ్గట్లు రవితేజ మార్క్ మాస్ ఎంటర్‌టైనర్ అనే విషయం స్పష్టమవుతోంది. ఇందులో రవితేజ తనకు బాగా కలిసొచ్చిన పోలీస్ పాత్రలో నటిస్తుండటంతో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
HCU భూముల విషయంలో పార్టీల ప్రచారాన్ని విద్యార్థులు నమ్మొద్దు – భట్టి
ఈ సినిమాను తొలుత వేసవిలో విడుదల చేయాలని భావించినప్పటికీ, తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ దీనిని జులైలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్‌లో నాగవంశీ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ వేసవిలో తమ బేనర్ నుంచి సూర్య అనువాద చిత్రం ‘రెట్రో’తో పాటు విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్‌డమ్’ సినిమాలు విడుదల కానున్నాయి. వీటి తర్వాత ‘మాస్ జాతర’ జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా, రవితేజ కెరీర్‌లో మరో విజయవంతమైన మాస్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని చెప్పుకొచ్చాడు.