Site icon HashtagU Telugu

Sampoornesh Babu : ‘మార్టిన్ లూథ‌ర్ కింగ్’ గా వస్తున్న సంపూర్ణేష్ బాబు

Martin Luther King First Look

Martin Luther King First Look

సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu) ..ఈ పేరు పెద్దగా సినీ లవర్స్ కు పరిచయం చేయాల్సిన పనిలేదు. హృదయ కాలేయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి..మొదటి సినిమాతోనే ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు. ఆ తర్వాత వచ్చిన కొబ్బరి మట్ట కూడా మంచి గుర్తింపే తెచ్చిపెట్టింది. ఆ రెండు సినిమాల విజయాలతో రెట్టింపు ఉత్సాహం తో వరుస సినిమాలు చేసాడు. కానీ అవేవి కూడా విజయాలు సాధించలేకపోయాయి. అదే విధంగా ఛాన్సులు కూడా తగ్గాయి. దీంతో కొంత గ్యాప్ తీసుకొని మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసారి కామెడీ జోనర్ కాకుండా పొలిటికల్ జోనర్ తో వస్తున్నాడు. ఏకంగా రెండు నేషనల్ అవార్డులు గెలుచుకున్న తమిళ సినిమాకు ఈ మూవీ రీమేక్ అని తెలుస్తోంది.

Read Also : Drugs Case : డ్ర‌గ్స్ కేసులో నటుడు నవదీప్ నివాసంలో నార్కోటిక్స్ అధికారుల సోదాలు

‘మార్టిన్ లూథర్ కింగ్’ (Martin Luther King) అనే టైటిల్ తో సంపూ రాబోతున్నాడు. ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘మండేలా’ (Mandela ) మూవీకి రీమేక్ అని తెలుస్తోంది. మండేలా సినిమా ఆధారంగానే ఈ సినిమాను రూపొందినట్లు సమాచారం. మండేలా చిత్రంలో కమెడియన్ యోగిబాబు (Yogibabu) తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి రెండు నేషనల్ అవార్డ్స్ తో పాటుగా.. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో ఇండియా నుంచి షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో ఒకటిగా మండేలా నిలిచింది. అలాంటి గొప్ప చిత్ర రీమేక్ లో సంపూ నటించాడు. ఇక ఈ మూవీలో డైరెక్టర్ వెంకటేష్ మాహా, నరేష్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీకి పూజా కొల్లూరు (Puja Kolluru
) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్ర ఫస్ట్ లుక్ లో సంపూ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. సంపూర్ణేష్‌బాబు త‌ల‌పై కిరీటం ఉండ‌టం, అందులో కొంత‌మంది నాయ‌కులు ఓట్ల కోసం ప్ర‌చారం చేస్తోన్న‌ట్లుగా డిజైన్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.