Vishnu – Manoj : అప్పుడు తమ్ముడు..ఇప్పుడు అన్న ఏంటో ‘మంచు ప్రేమ కథ ‘

Vishnu - Manoj : గతంలో మనోజ్ పెళ్లి సందర్భంగా విష్ణు హాజరు కాలేదని, దానిపై ఇద్దరి మధ్య విభేదాలు మరింత పెరిగాయని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇలా ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడం, మరీ ముఖ్యంగా మనోజ్ 'అన్నా' అని సంబోధించడం చూస్తుంటే వారి మధ్య ఉన్న సమస్యలు పరిష్కారమయ్యాయని స్పష్టమవుతుంది

Published By: HashtagU Telugu Desk
Manoj Vishnu

Manoj Vishnu

గత కొంతకాలంగా మంచు సోదరులు విష్ణు, మనోజ్ (Manchu Vishnu & Manoj) మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరి మధ్య ఉన్న విభేదాలు తొలిగిపోయాయన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటూ అభిమానులకు సంతోషాన్ని పంచుతున్నారు.

తేజ సజ్జా హీరోగా మంచు మనోజ్ కీలక పాత్రలో నటించిన ‘మిరాయ్’ సినిమా ఈరోజు విడుదలైంది. ఈ సందర్భంగా మంచు విష్ణు ట్విట్టర్/ఎక్స్ వేదికగా ‘మిరాయ్’ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దీనికి స్పందించిన మంచు మనోజ్ “థాంక్యూ సో మచ్ అన్నా, మిరాయ్ బృందం తరపున కూడా మీకు ధన్యవాదాలు” అని బదులిచ్చారు. ఈ సంభాషణతో ఇద్దరి మధ్య ఉన్న దూరం తగ్గిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

School Bus: స్కూల్ బ‌స్సుకు త‌ప్పిన ప్ర‌మాదం.. ప్ర‌మాద స‌మ‌యంలో 20 మంది!

గతంలో మనోజ్ పెళ్లి సందర్భంగా విష్ణు హాజరు కాలేదని, దానిపై ఇద్దరి మధ్య విభేదాలు మరింత పెరిగాయని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇలా ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడం, మరీ ముఖ్యంగా మనోజ్ ‘అన్నా’ అని సంబోధించడం చూస్తుంటే వారి మధ్య ఉన్న సమస్యలు పరిష్కారమయ్యాయని స్పష్టమవుతుంది. ఈ పరిణామం మంచు ఫ్యామిలీ అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. మంచు బ్రదర్స్ మరోసారి కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటున్నారు.

  Last Updated: 12 Sep 2025, 06:52 PM IST