Site icon HashtagU Telugu

Maniratnam : బాహుబలి, రాజమౌళిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మణిరత్నం..

Maniratnam interesting comments on Bahubali and Rajamouli

Maniratnam interesting comments on Bahubali and Rajamouli

దర్శకుడు మణిరత్నం(Maniratnam) ఎన్నో క్లాసిక్ హిట్స్ తో మనల్ని అలరించారు. గత సంవత్సరం మణిరత్నం స్టార్ కాస్ట్ తో పొన్నియిన్ సెల్వన్(Ponniyin Selvan) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళ రాజుల చరిత్రకు సంబంధించిన ఓ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత.. ఇలా అనేకమంది స్టార్స్ ఈ సినిమాలో నటించారు. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 పాన్ ఇండియా రిలీజ్ చేసినా తమిళ్ లో మాత్రమే విజయం సాధించింది. మిగిలిన చోట్ల ఆశించినంత విజయం సాధించలేదు.

ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 సినిమాతో రాబోతున్నారు మణిరత్నం. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 28న పొన్నియిన్ సెల్వన్ 2 పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ అంతా ఇండియా వైడ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్ లో పొన్నియిన్ సెల్వన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ ఈవెంట్ లో దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ.. నేను గతంలోనే చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. రాజమౌళి బాహుబలి సినిమా లేకపోతే పొన్నియిన్ సెల్వన్ సినిమా లేదు. బాహుబలి సినిమాని రెండు పార్టులుగా తీసి, పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేసి రాజమౌళి సక్సెస్ సాధించారు. ఈ విషయంలో మాకు ఒక మార్గాన్ని చూపించారు రాజమౌళి. రాజమౌళి వేసిన బాటలోనే ఇప్పుడు మేము వెళ్తున్నాము. బాహుబలి లేకపోతే నిజంగా పొన్నియిన్ సెల్వన్ ఉండేది కాదు అని అన్నారు.

 

Also Read :   Lavanya Tripathi : అనాథాశ్రమంలో లావణ్య త్రిపాఠి..