Kannappa Akshay Kumar : వారం రోజుల షూటింగ్ కు అన్ని కోట్లా.. కన్నప్పలో అక్షయ్ రెమ్యునరేషన్ లీక్..!

Kannappa Akshay Kumar మంచు విష్ణు లీడ్ రోల్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో మంచు విష్ణు చేస్తున్న కన్నప్ప సినిమా భారీ అంచనాలతో

Published By: HashtagU Telugu Desk
Manchu Vishnu Kannappa Release Confusion

Manchu Vishnu Kannappa Release Confusion

Kannappa Akshay Kumar మంచు విష్ణు లీడ్ రోల్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో మంచు విష్ణు చేస్తున్న కన్నప్ప సినిమా భారీ అంచనాలతో వస్తుంది. ఈ సినిమాలో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ తో పాటుగా బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ ని కూడా తీసుకొచ్చారు. కన్నప్పలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది. ప్రభాస్ కూడా ఈ సినిమాలో నందీశ్వరుడిగా అదరగొట్టనున్నారు.

అక్షయ్ కుమార్ ఈ సినిమా కోసం కేవలం వారం రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చారని తెలుస్తుంది. సినిమాలో వారం రోజుల షూటింగ్ కోసం ఏకంగా 6 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకున్నారని తెలుస్తుంది. సినిమాలో అక్షయ్ రోల్ సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. కన్నప్ప సినిమాను భారీ కాస్టింగ్ తో అంచనాలకు మించి తెరకెక్కిస్తున్నారు.

Also Read : Getup Srinu : చిన్న ప్రాణాలు.. చిన్న కామెంట్.. వైరల్ అవుతున్న గెటప్ శ్రీను కామెంట్స్..!

సినిమాలో ప్రతి పాత్ర ఒకదానికి మించి మరొకటి అనేలా ఉంటుందని తెలుస్తుంది. మంచు విష్ణు ఈ కన్నప్ప సినిమాను 100 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి కాగా మిగతా సగం కూడా త్వరలో పూర్తి చేసి ఈ ఇయర్ ఎండింగ్ కి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

కన్నప్ప సినిమాను మంచు విష్ణు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడని తెలుస్తుంది. సినిమా తప్పకుండా అంచనాలను మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సినిమా నుంచి మంచు విష్ణు ఫస్ట్ లుక్ బజ్ పెంచగా సినిమా నుంచి టీజర్ వస్తే లెక్క వేరేలా ఉంటుందని అంటున్నారు.

  Last Updated: 06 May 2024, 02:43 PM IST