Manchu Vishnu : మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప(Kannappa) సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ గా కన్నప్ప సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నాడు మంచు విష్ణు. తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు మంచు విష్ణు. ఓ గుర్రం మీద కూర్చొని ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు విష్ణు.
గుర్రంతో ఉన్న ఫొటోలు షేర్ చేసి.. ఆ గుర్రం పేరు టిక్కీ అని, నాకు బ్రదర్, బెస్ట్ ఫ్రెండ్ లాంటి వాడు అని తెలిపాడు. అలాగే ఇది ఒక అద్భుతమైన గుర్రం అని, ఇది నన్ను ఎప్పుడు చేయని స్టంట్స్ చేయించింది అని పోస్ట్ చేసాడు. దీంతో ఈ ఫొటోలు వైరల్ అవ్వగా ఆ గుర్రాన్ని పొగుడుతున్నారు నెటిజన్లు.
ఇక కన్నప్ప సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మధుబాల, బ్రహ్మానందం, శరత్ కుమార్, శివరాజ్ కుమార్.. ఇలా చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. 150 కోట్ల భారీ బడ్జెట్ తో న్యూజిలాండ్ అడవుల్లో కన్నప్ప సినిమాని షూట్ చేస్తున్నారు. ఈ సినిమాని మోహన్ బాబు నిర్మిస్తుండగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి.
Also Read : Shraddha Arya : తల్లి కాబోతున్న హీరోయిన్.. ప్రగ్నెన్సీ గురించి పోస్ట్..