Manchu Manoj : నా కట్టే కాలే వరకు మోహన్ బాబు అబ్బాయినే.. సొంతవాళ్లే దూరం పెట్టారు.. మంచు మనోజ్ స్పీచ్ వైరల్..

మంచు మనోజ్ మళ్ళీ విష్ణు పై సెటైర్లు వేస్తూ, తన ఫ్యామిలీ గురించి, పడ్డ కష్టాల గురించి, పెడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.

Published By: HashtagU Telugu Desk
Manchu Manoj Interesting Comments in Bhairavam Trailer Launch Event

Manchu Manoj

Manchu Manoj : గత కొంతకాలంగా మంచు ఫ్యామిలిలో వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మంచు ఫ్యామిలీ వర్సెస్ మంచు మనోజ్ అన్నట్టు ఈ వివాదాలు సాగుతున్నాయి. మోహన్ బాబు, విష్ణు.. మనోజ్ పై ఆరోపణలు చేస్తూ, అతని ఇల్లు, కార్లు తమవే అని తీసుకున్నారు. మనోజ్ తిరుపతిలోని వాళ్ళ కాలేజీలో అక్రమాలు జరుగుతున్నాయని బయటపెట్టినందుకే ఇదంతా చేస్తున్నాడని ఆరోపించాడు.

మొత్తానికి మంచు ఫ్యామిలీ వివాదం మాత్రం రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తుంది. దీనికి తోడు మంచు విష్ణు, మనోజ్ ఇద్దరూ ఒకరిపై ఒకరు మీడియా ముందే సెటైర్లు వేసుకుంటున్నారు. తాజాగా భైరవం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో మంచు మనోజ్ మళ్ళీ విష్ణు పై సెటైర్లు వేస్తూ, తన ఫ్యామిలీ గురించి, పడ్డ కష్టాల గురించి, పెడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.

మంచు విష్ణు మాట్లాడుతూ.. ఇటీవల చాలా జరిగాయి. చాలా చూసాను. కట్టుబట్టలతో రోడ్డు మీదకు తెచ్చారు. నేను బయటకి వెళ్ళినపుడు నా పిల్లల వస్తువులతో సహా అన్ని రోడ్డు మీద పెట్టారు. బయటకు వెళ్లడానికి కార్లు లేకుండా తీసుకెళ్లిపోయారు. నాకు శివుడు ఫ్యాన్స్ రూపంలో వచ్చి ఇంటి బయట నా కోసం 20 కార్లు పెట్టించాడు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నాకు కోపం రావట్లేదు. నా కట్టే కాలే వరకు నేను మోహన్ బాబు అబ్బాయినే. చిన్నప్పట్నుంచి న్యాయం, నీతి వైపు నిలబడాలని పెంచి ఇప్పుడు అదే పని చేస్తుంటే తప్పు అంటున్నారు. సొంతవాళ్లే దూరం పెట్టినా మీరు నన్ను దగ్గర చేసుకొని మీ ప్రేమను పంచుతున్నారు. నేను ధైర్యంగా ఉన్నాను అంటే మీ వల్లే. నా భార్య, పిల్లలు తప్ప నాకు పెద్ద కుటుంబం లేదు. మీడియా కూడా నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు సపోర్ట్ గా నిలబడ్డారు. శివయ్యా అని పిలిస్తే శివుడు రాదు. ఆయన్ని మనసారా తలుచుకుంటే మా దర్శకుడి రూపంలోనో, మీ రూపంలోనో వస్తాడు అంటూ చివర్లో మంచు విష్ణుకి కౌంటర్ ఇచ్చాడు.

 

Also Read : Bhairavam : ‘భైరవం’ ట్రైలర్ చూశారా? ముగ్గురు హీరోల యాక్షన్ సినిమా..

  Last Updated: 19 May 2025, 11:08 AM IST