గత నాల్గు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘మంచు ఫామిలీ’ (Manchu Family) గొడవ కాకరేపిన సంగతి తెలిసిందే. క్రమ శిక్షణ..క్రమ శిక్షణ అంటూ ప్రతి చోట మాట్లాడే మోహన్ బాబు & సన్స్ (Mohanbabu & Sons) ..నడిరోడ్డు పై కొట్లాటకు దిగడం చూసి ఇదేనా క్రమ శిక్షణ అంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. గతంలో విష్ణు – మనోజ్ (Vishnu & Manoj)మధ్య గొడవలు బయటకు రాగా..తాజాగా మోహన్ బాబు – మనోజ్ ల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడం అందర్నీ షాక్ కు గురి చేసింది. గత కొద్దీ రోజులుగా మోహన్ బాబు ఫ్యామిలీ ఆస్తుల గొడవలు నడుస్తున్నాయని ప్రచారం జరిగినప్పటికీ అధికారికంగా మాత్రం బయటకు రాకపోయేసరికి ఎవ్వరు పెద్దగా నమ్మలేదు. కానీ రెండు రోజుల క్రితం ఏకంగా మనోజ్ ,మోహన్ బాబులు ఇద్దరు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం..రక్షణ కల్పించండి అంటూ పోలీసులను ఆశ్రయించడం తో తెలుగు ప్రజలు మాట్లాడుకోవడం స్టార్ట్ చేసారు. మూడు రోజులుగా ఇదే తంతు మీడియా లో హైలైట్ అవ్వగా ..ఈరోజు ఈ గొడవ కాస్త సర్దుమణిగినట్లు తెలుస్తుంది.
ఈ గొడవను ఇలా పెంచుకుంటే అది పెరిగిపోతూనే ఉంటుందని.. వీలైనంత శుభం కార్డు వేసుకుంటూనే మంచిదని మోహన్ బాబుకు అలాగే విష్ణు , మనోజ్ లకు చిత్రసీమ సన్నిహితులు సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో మోహన్ బాబు కూడా తన సన్నిహితులకు మనోజ్ తో సమస్య పరిష్కారానికి చర్చలు జరిపేందుకు అనుమతి ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మనోజ్ కుటుంబంలో ఒంటరి కాదని ఆయనకు తల్లి తో పాటు సోదరి లక్ష్మి సపోర్టు మొదటి నుండి ఉందని సన్నిహితులు చెపుతున్నారు. తల్లి ఇప్పటి వరకూ బయటకు రాలేదు కానీ.. మనోజ్ ధైర్యంగా ఇప్పటికీ ఇంట్లోనే ఉండటానికి తల్లే కారణమని అంటున్నారు. ప్రస్తుతం మోహన్ బాబు తో పాటు కుమారులు , కూతురి తో పాటు తన దగ్గరి వారిని పిలిచి చర్చలు జరుపుతున్నారట..అభిమానులు కూడా త్వరగా ఈ పంచాయితీ సర్దుమణగాలని..అందరు బాగుండాలని కోరుకుంటున్నారు.
Read Also : 90 Year Old Woman Graduation : 90 ఏళ్ల వయసులో డిగ్రీ పూర్తి చేసిన వృద్ధురాలు