Site icon HashtagU Telugu

Mallareddy : కసీ కపూర్ ..కసికసిగా ఉందంటూ మల్లారెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు

Mallareddykasi

Mallareddykasi

బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy) మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఓ సినిమా ఆడియో ఫంక్షన్‌కు హాజరైన ఆయన, హీరోయిన్ కసీ కపూర్ (Kasikapoor) పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. “హీరోయిన్ కసీ కపూర్ ..కసికసిగా ఉంది” అంటూ అసభ్యకరంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజా ప్రతినిధిగా ఉండి ఇలా మాట్లాడటం దారుణమని, మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Earthquake: భారత్‌ మరోసారి సాయం.. మయన్మార్‌కు 80 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది!

ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. చట్ట సభల్లో ఉండే ప్రజా ప్రతినిధులు మహిళలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సమంజసం కాదని నెటిజన్లు మండిపడుతున్నారు. అంతేగాక అసెంబ్లీని వదిలిపెట్టి సినిమా ఫంక్షన్లకు హాజరవడం తగదంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన నాయకులు ఇటువంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని విమర్శకులు చెబుతున్నారు.

మల్లారెడ్డి గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి ఆయన చేసిన వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని చిన్నాభిన్నం చేసేలా ఉన్నాయని, ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించకూడదని మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై పొలిటికల్ వర్గాల్లోనూ చర్చ మొదలైంది. మల్లారెడ్డి తమ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ వివాదం ఇంకా ఎటువైపు వెళ్లనుందో చూడాలి.