Site icon HashtagU Telugu

Unni Mukundan : సినిమాలో రొమాన్స్ చేయమని ఇబ్బంది పెట్టారు.. హీరో కామెంట్స్..

Malayalam Hero Unni Mukundan says no to Romantic Scenes

Unni Mukundan

Unni Mukundan : ఇటీవల సినిమాల్లో రొమాన్స్, ముద్దు సీన్స్.. ఇలాంటివి చాలా కామన్ అయిపొయింది. స్టార్ హీరోలు సైతం కిస్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ చేస్తున్నారు. హీరోయిన్స్ కూడా ఓకే అని చెప్తుండటంతో కొన్ని సినిమాల్లో కావాలని మరీ ఈ రొమాన్స్ సీన్స్ ని ఇరికిస్తున్నారు దర్శక నిర్మాతలు.

అయితే తాజాగా మలయాళం స్టార్ హీరో ఉన్ని ముకుందన్ రొమాంటిక్ సీన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఉన్ని ముకుందన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి ఇప్పుడు హీరోగా మలయాళంలో దూసుకుపోతున్నాడు. తెలుగులో కూడా భాగమతి, ఖిలాడీ, మాలికాపురం సినిమాలతో బాగా ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇటీవలే మోస్ట్ వైలెంట్ ఫిలిం మార్కోతో వచ్చి సౌత్ లో పెద్ద హిట్ కొట్టాడు.

అయితే ఉన్ని ముకుందన్ సినిమాల్లో లిప్ కిస్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఎందుకు ఉండవు అని ఓ ఇంటర్వ్యూలో అడగ్గా ఉన్ని ముకుందన్ సమాధానమిస్తూ.. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడే కిస్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ కు దూరంగా ఉండాలి అనుకున్నాను. అన్ని ఏజ్ ప్రేక్షకులు నా సినిమా చూడాలి. అందుకే నేను నటించే సినిమాల్లో అవి ఉండవు. కొంతమంది డైరెక్టర్స్, నిర్మాతలు కిస్ సీన్స్ లో, రొమాంటిక్ సీన్స్ లో నటించాలని నాపై ఒత్తిడి తెచ్చారు. వేరే హీరోల సినిమాలు చూపించి అలా చేయాలని అన్నారు. కానీ నేను నో చెప్పాను. రొమాన్స్ అంటే ముద్దులు పెట్టుకోవడమే కాదు సింపుల్ గా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలా రొమాంటిక్ సీన్స్ ని రాసుకోవచ్చు. వేరే హీరోలు నటించారు అంటే అది వాళ్ళ ఇష్టం. కానీ నేను మాత్రం అలాంటి సీన్స్ లో నటించను అని రూల్ పెట్టుకున్నాను అన్నారు.

ఇలాంటి మాటలు హీరోయిన్స్ నుంచి ఒకప్పుడు వినేవాళ్ళం. ఇప్పుడు హీరో ఇలా చెప్తుండటంతో ఫ్యాన్స్, నెటిజన్లు ఉన్ని ముకుందన్ ని అభినందిస్తున్నారు.

Also Read : Balakrishna : బాలయ్య అఖండ 2లో విలన్ రోల్ చేస్తున్న హీరో..? షూటింగ్ చేశాను అంటూ లీక్ చేసిన హీరో..

Exit mobile version