Prithviraj Sukumaran గుంటూరు కారం తర్వాత సూపర్ స్టార్ మహేష్ రాజమౌళితో సినిమా లాక్ చేసుకున్నాడు. కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఒక అద్భుతమైన సెటప్ రెడీ చేస్తున్నారట. ఇప్పటికే సినిమా ఆఫ్రికా ఫారెస్ట్ అడవుల్లో షూట్ చేస్తారని తెలుస్తుండగా రాజమౌళి అండ్ టీం లొకేషన్స్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.
ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ తో పనిచేస్తున్నారు జక్కన్న. సినిమా కాస్టింగ్ గురించి ఇంకా క్లారిటీ రాకపోయినా లేటెస్ట్ గా మహేష్ రాజమౌళి సినిమాలో మలయాళ స్టార్ ఉండబోతున్నాడని చెప్పుకుంటున్నారు.
మలయాళంలో నటుడిగా డైరెక్టర్ గా తన మార్క్ చాటుతున్న పృధ్విరాజ్ సుకుమారన్ మహేష్ 29 లో భాగం అవుతున్నాడని టాక్. ఈమధ్యనే ప్రభాస్ సలార్ 1 లో వరద రాజ మన్నార్ పాత్రలో పృధ్విరాజ్ నటించాడు. ఇప్పుడు మహేష్ రాజమౌళి సినిమాలో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ కి ఓకే చెప్పాడని తెలుస్తుంది. అదే నిజమైతే మాత్రం ఎస్.ఎస్.ఎం.బి 29 సినిమా ఒక రేంజ్ లో ఉండబోతుందని చెప్పొచ్చు.
పాన్ ఇండియా కాదు ఈసారి పాన్ వరల్డ్ షేక్ అయ్యేలా రాజమౌళి ప్లానింగ్ ఉంది. ఆర్.ఆర్.ఆర్ తో కేవలం ఒక సాంగ్ తో ఆస్కార్ అందుకున్న జక్కన్న టీం ఈసారి సినిమాకు రెండు మూడు ఆస్కార్ లు వచ్చేలా టార్గెట్ పెట్టుకున్నారని తెలుస్తుంది. మహేష్ 29 సినిమాలో డిఫరెంట్ లుక్ తో అదరగొడతాడని తెలుస్తుంది.
Also Read : CSK vs RCB IPL : నేటి ఐపిఎల్ మ్యాచ్ లో ఇండియన్ 2 టీం.. కమల్ తో పాటు శంకర్ కూడా..!