Malavika Mohanan &Prabhas: ప్రభాస్ కటౌట్, చరిష్మాటిక్.. కేరళ బ్యూటీ ఇంట్రస్టింగ్ కామెంట్స్

కేరళ హాట్ బ్యూటీ మాళవిక మోహనన్ ప్రభాస్ పక్కన నటించబోతోంది. ఈ సందర్భంగా ఆయనపై పోగడ్తల వర్షం కురిపించింది.

Published By: HashtagU Telugu Desk
Prabhas And Malavika

Prabhas And Malavika

పాన్ ఇండియా హీరో, టాలీవుడ్ డార్లింగ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరమే లేదు. వరుస భారీ ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉన్నాడు. టాలీవుడ్ టు బాలీవుడ్ అంటూ పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఆదిపురుష్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్న యంగ్ రెబల్ స్టార్ మారుతి తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఈ మూవీ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో కేరళ హాట్ బ్యూటీ మాళవిక మోహనన్ ప్రభాస్ పక్కన నటించబోతోంది.

ఈ సందర్భంగా ఈ హీరోయిన్ మీడియాతో చిట్ చాట్ చేసింది. అయితే మీరు ప్రభాస్ గురించి ఏం చెబుతారు? అని అడగ్గా ప్రభాస్ కటౌట్, చరిష్మాటిక్ అంటూ ఓ మాటలో చెప్పేసింది. ఈ కామెంట్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ బ్యూటీలో ప్రభాస్ తో నటించేందుకు తహాతహాలాడుతోంది. తన అందాలతో మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ టాలీవుడ్ లోకి ఎంటీ ఇస్తోంది.

ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్(Sanjay Dutt)ను తీసుకోవాలనుకుంటున్నారట. ఇప్పటికే దర్శకనిర్మాతలు సంజయ్ దత్ తో సంప్రదింపులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. సంజయ్ ను విలన్ రోల్ కోసం సంప్రదిస్తున్నారా..? లేక మరేదైనా పాత్రా..? అనే విషయంలో క్లారిటీ లేదు. ఈ మధ్యకాలంలో సంజయ్ దత్ కి విలన్ గా ఆఫర్స్ బాగా ఎక్కువయ్యాయి. ‘కేజీఎఫ్2’ సినిమాలో కూడా ఆయన విలన్ గా కనిపించారు. రీసెంట్ గా దళపతి విజయ్ సినిమాలో ఆయన్ను విలన్ గా తీసుకున్నట్లు సమాచారం. దానికి రూ.10 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారట. మరి ప్రభాస్ సినిమాలో నటించడానికి ఈ నటుడు ఎంత డిమాండ్ చేస్తారో చూడాలి.

Also Read: Adipurush Song: ఆదిపురుష్ నుంచి జైశ్రీరామ్‌ సాంగ్ రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!

  Last Updated: 20 May 2023, 05:55 PM IST