Site icon HashtagU Telugu

SSMB 28 Update: మహేష్ బ్యాక్ టు బ్యాక్ కాల్షీట్లు.. శరవేగంగా SSMB 28 షూటింగ్!

Ssmb28

Ssmb28

ఏ ముహూర్తాన మహేశ్ (Mahesh Babu), త్రివిక్రమ్ మూవీ మొదలుపెట్టారో కానీ ఈ మూవీ (SSMB 28) పలు వాయిదాలు పడుతున్న విషయం తెలిసిందే. కథ, కథనం, యాక్టర్స్ అందరూ సిద్ధంగా ఉన్నా హీరో మహేశ్ బాబు కారణంగా ఈ మూవీకి అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో మహేశ్ గట్టి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే మహేష్ బాబుతో సినిమా అంటేనే గ్యాప్స్ వ్యవహారం. ఎప్పుడు సెట్స్ పైకి వస్తాడో, ఎప్పుడు విదేశీ ప్రయాణాలు పెట్టుకుంటాడో ఎవ్వరూ చెప్పలేరు.

మధ్యలో యాడ్స్  (Adds) షూటింగ్స్ అదనం. దీంతో మహేష్ తో సినిమా అంటే ఆ షూటింగ్ పడుతూలేస్తూ సాగుతుంటుంది. అందుకే ఏడాదికి ఒక సినిమా వస్తే కష్టం. అయితే త్రివిక్రమ్ సినిమా కోసం (SSMB 28) మాత్రం మహేష్ రూటు మార్చాడు. వరుసగా కాల్షీట్లు ఇచ్చాడు. ఒక షెడ్యూల్ అయిన వెంటనే, మరో షెడ్యూల్ (Shedule) మొదలుపెడుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా లేట్ అవుతోంది. మహేష్ బ్యాక్ టు బ్యాక్ కాల్షీట్లు ఇవ్వడానికి ఇదొక కారణమైతే, మరో ముఖ్యకారణం కూడా ఉంది.

మహేష్-త్రివిక్రమ్ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ (Streaming) ను నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ మొత్తానికి దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఎగ్రిమెంట్ లో రిలీజ్ డేట్ పై ఓ కండిషన్ పెట్టారట. ప్రకటించిన తేదీకి సినిమాను విడుదల చేయకపోతే పేమెంట్ లో కటింగ్ తప్పదు. మహేష్ ఇలా శరవేగంగా షూటింగ్ చేయడానికి ఇది కూడా ఓ కారణమని తెలుస్తోంది. పూజా హెగ్డే, శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు (SSMB 28) తమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రకటించిన రిలీజ్ డేట్ కు సినిమాను విడుదల చేయాలని మహేశ్ నిర్ణయించుకున్నాడు.

Also Read: Whats App: వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. 30 కాదు 100 పంపొచ్చు!