మహేష్ బాబు సొంతూరులో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ (Mahesh – Trivikram) కలయికలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం (Guntur Kaaram). ఈ మూవీ ఫై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొని ఉన్నాయో..మాటల్లో చెప్పలేం. వీరిద్దరి కలయికలో గతంలో అతడు , ఖలేజా చిత్రాలు రాగా. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ మూవీ గా గుంటూరు కారం రాబోతుంది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో రెండు రోజుల్లో జనవరి 12 న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈరోజు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గుంటూరు నగరంలో అట్టహాసంగా జరిపి అభిమానుల్లో ఆనందం నింపారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Guntur Kaaram Pre Release Event) లో చిత్ర యూనిట్ అంత పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మహేష్ బాబు (Mahesh Babu Speech in Guntur Kaaram Pre Release) మాట్లాడుతూ..అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఇకపై నాకు అమ్మ..నాన్న అన్ని మీరే అని అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. “గుంటూరులో వేడుక జరగడం సంతోషంగా ఉంది. ఇక్కడ వేడుక జరపాలనే ఐడియా త్రివిక్రమ్ గారు ఇచ్చేందే. ఆయనకు మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎక్కడ ఫంక్షన్ చేయాలి అనుకుంటే మీ ఊళ్లో చేస్తే బాగుంటుందన్నారు. ఇప్పుడు మన ఊళ్లోనే వేడుక జరుగుతుంది. త్రివిక్రమ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాకు ఫ్రెండ్ కంటే ఎక్కువ. నా ఫ్యామిలీ మెంబర్ లాగా. నేను ఆయన గురించి బయట ఎక్కువగా మాట్లాడను. మన ఇంట్లో మనుషుల గురించి ఎక్కువగా ఏం మాట్లాడుతాం?’’ అని అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
‘‘గత రెండు సంవత్సరాలుగా ఆయన నాకు ఇచ్చిన సపోర్టు అమూల్యమైనది. ఆయన సినిమాల్లో నేను చేసినప్పుడల్లా నా ఫర్ఫార్మెన్స్ లో ఓ మ్యాజిక్ జరుగుతుంది. ఎందుకో నాకూ తెలియదు. ‘అతడు’, ‘ఖలేజా’, తర్వాత ఇప్పుడు ‘గుంటూరు కారం’లోనూ జరిగింది. ఇందులో కూడా కొత్త మహేష్ బాబును చూడబోతున్నారు. దానికి ఆయనే కారణం. సంక్రాంతి నాకు కలిసి వచ్చిన వచ్చిన పండుగ. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుంది’’ అని అన్నారు.
‘‘మా ప్రొడ్యూసర్ చిన్నబాబు ఫేవరెట్ హీరో నేను. ఆయన మానిటర్ చూసి ఆనందపడే వారు. ప్రొడ్యూసర్ ముఖంలో ఆనందం చూసినప్పుడు కలిగే ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. శ్రీలీల, మీనాక్షి చౌదరి కూడా చక్కగా చేశారు. శ్రీలీలతో డ్యాన్స్ వేయడం, వామ్మో! అనిపించింది. వారితో పని చేయడం సంతోషంగా అనిపించింది. ఈ సినిమాకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ మరో లెవెల్. కుర్చీ మడతపెట్టి సాంగ్ కు థియేటర్లు బద్దలైపోతాయి. పాతికేళ్ల నా సినీ కెరీర్ లో మీరు చూపించిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏమీ చేయలేను. సంక్రాంతి మాకు కలిసి వచ్చిన పండగ. ఈ పండగకు సినిమా విడుదల అయ్యిందంటే బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ ఏడాది కూడా అదే రిపీట్ అవుతుంది. మా నాన్న లేరు. అమ్మ లేరు. ఇప్పటి నుంచి మీరే నాకు అమ్మ, నాన్న.. అన్నీ. మీ ప్రేమ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను” అని తెలిపి అభిమానుల్లో ఆనందం నింపారు.
ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram Speech in Guntur Kaaram Pre Release) మాట్లాడుతూ..తెలుగు సినిమా పరిశ్రమలో విడదీయలేని ఒక అంతర్భాగం. గొప్ప నటుడు, మహా మనిషితో నేను నేరుగా పని చేయలేదు. కానీ, కృష్ణగారు చేసిన సినిమాకు నేను పోసాని మురళి గారి దగ్గర అసిస్టెంట్ గా పని చేశాను. ఆ తర్వాత, ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు తీసినప్పుడు ఆయనతో మాట్లాడాను. ఆయనతో గడిపిన ప్రతి క్షణం నాకు అపూర్వమైనది. అంత గొప్ప మనిషికి పుట్టిన మహేష్ ఇంకా ఎంత అదృష్టవంతుడో అనిపిస్తుంది. వాళ్ల నాన్నగారు చేయలేని వెంచర్.. చేయలేని సినిమాలను ఆయన చేయడానికి రెడీగా ఉంటారు అనిపిస్తుంది. ఒక సినిమాకు 100 శాతం పని చేయాలంటే 200 శాతం పని చేస్తాడు ఆయన. నేను ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు చేసేటప్పుడు ఎలా ఉన్నారో? ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఆయన రీసెంట్ గా సినిమాల్లోకి వచ్చినట్లుగానే అనిపిస్తుంది. ఆయనను మీరంతా ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. జనవరి 12న థియేటర్లలో కలుద్దాం. సంక్రాంతిని గొప్పగా జరుపుకుందాం” అన్నారు.
ఇక ఈ ఫంక్షన్ లో మహేష్ మరోసారి తన సింప్లిసిటీతో అందర్నీ కట్టిపడేసాడు..ఇటీవల కాలంలో రెండు హిట్లు పడితేనే హీరోలు ఆగడం లేదు..అలాంటిది ఇండస్ట్రీ లో హీరోగా అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తి అయ్యింది. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇండస్ట్రీ కి ఇచ్చాడు..అయినప్పటికీ మహేష్ లో నేనో పెద్ద హీరో అనే ఫీలింగ్ రవ్వంత లేదు. ఇంట్లోనే కాదు బయటకు వెళ్లిన సింప్లిసిటీకి ఎక్కుడ ప్రాధాన్యత ఇస్తుంటారు. అందుకే అందరు మహేష్ ను ఇష్టపడుతుంటారు. ఈరోజు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మహేష్ చాల సింపుల్ గా కనిపించారు. ఒక నార్మల్ చెక్ షర్ట్ తో వచ్చి ఆకట్టుకున్నాడు మహేష్.
Read Also : Naa Saami Ranga Trailer Talk : యాక్షన్ తో నింపేసిన ‘నా సామిరంగ’ ట్రైలర్ ..