Site icon HashtagU Telugu

Meenakshi Chaudhary : మహేష్ మరదలు మరో లక్కీ ఛాన్స్ అందుకుంది..!

Meenakshi Chaudhary Next Leading Heroine in South

Meenakshi Chaudhary Next Leading Heroine in South

Meenakshi Chaudhary యువ హీరోయిన్ మీనాక్షి చౌదరి తెలుగులో వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఓ పక్క యంగ్ హీరోల సరసన నటిస్తున్న మీనాక్షి స్టార్ హీరోలను టార్గెట్ పెట్టుకుంది. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ తో గుంటూరు కారం సినిమాలో నటించింది అమ్మడు. అయితే సినిమాలో శ్రీ లీల మెయిన్ లీడ్ కాగా మీనాక్షి కేవలం రెండు మూడు సీన్స్ కే పరిమితమైంది. మహేష్ మరదలిగా చేసిన తక్కువ సీన్స్ అయినా కూడా మీనాక్షి చౌదరి ఆకట్టుకుంది.

ప్రస్తుతం వరుణ్ తేజ్ తో మట్కా సినిమా ఛాన్స్ అందుకున్న మీనాక్షి లేటెస్ట్ గా సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్ సినిమాలో కూడా అవకాశం అందుకున్నట్టు తెలుస్తుంది. వెంకీ అనిల్ రావిపుడి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా త్వరలో అనౌన్స్మెంట్ రాబోతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ముందు త్రిషని హీరోయిన్ గా అనుకోగా ఆమె కాదనడం తో మీనాక్షి చౌదరిని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.

మహేష్ సినిమాలో చిన్న పాత్ర చేసింది ఇక మీనాక్షికి అవకాశాలు వస్తాయా అనుకున్న వారికి తన ఛాన్స్ లతో సర్ ప్రైజ్ చేస్తుంది అమ్మడు. స్టార్ హీరోయిన్ కి కావాల్సిన క్వాలిటీస్ అన్ని ఉండటంతో మీనాక్షి చౌదరికి అవకాశాలు వస్తున్నాయి. మరి వెంకటేష్ తో వచ్చిన ఈ ఛాన్స్ ఆమె కెరీర్ కి ఎలా హెల్ప్ అవుతుందో చూడాలి. సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ తో వస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతి రేసులో దిగుతుందని తెలుస్తుంది.

Also Read : Viswak Sen : లేడీ గెటప్ లో విశ్వక్ సేన్.. ఏ సినిమా కోసమో తెలుసా..?