Mahesh Ramyakrishna Special Song సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం మరికొద్ది గంటల్లో రిలీజ్ అవుతుంది. మిడి నైట్ షోస్ నుంచే గుంటూరు కారం హడావుడి మొదలు కానుంది. ఈ సినిమాను త్రివిక్రం మార్క్ కన్నా మహేష్ మాస్ ఫాలోయింగ్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కించినట్టు ఉన్నారు. సినిమాలో శ్రీలీల అమ్ము పాత్రలో అలరించనుంది. ఇక థమన్ మ్యూజిక్ ఈ సినిమాకు మరో హైలెట్ గా ఉండబోతుందని అంటున్నారు. సర్కారు వారి పాట తర్వాత మహేష్ నుంచి వస్తున్న గుంటూరు కారం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో మహేష్ మాస్ స్టామినా చూపిస్తున్నాడు.
We’re now on WhatsApp : Click to Join
ఈ సినిమా కాస్టింగ్ విషయానికి వస్తే కీలక పాత్రలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ నటించినట్టు తెలుస్తుంది. ట్రైలర్ లో వీరి పాత్రలకు అంత పెద్ద స్కోప్ ఇవ్వలేదు కానీ మహేష్ మదర్ రోల్ లో రమ్యకృష్ణ నటిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమా కథ యద్ధనపుడి సులోచనరాణి రచించిన కీర్తి కెరటాలు నవల ఆధారంగా రమ్యకృష్ణ పాత్ర రాసినట్టు చెప్పుకుంటున్నారు. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఆ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.
ఇదిలాఉంటే ఈ సినిమాలో రమ్యకృష్ణ మహేష్ కి మదర్ రోల్ లో నటించగా మహేష్ నటించిన నాని సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ లో అలరించారు. మహేష్ ఎస్.జె సూర్య కాంబోలో వచ్చిన నాని సినిమాలో మార్కెండేయ సాంగ్ లో రమ్యకృష్ణతో కలిసి ఆడి పాడాడు మహేష్. అయితే తీరా రిలీజ్ టైం లో ఆ సాంగ్ ని సినిమా నుంచి తీసేశారు. కానీ ఆ సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్ లో ఉంది. గుంటూరు కారం సినిమాలో రమ్యకృష్ణని చూడగానే మహేష్ తో రమ్యకృష్ణ చేసిన మార్కెండేయ సాంగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది.
Also Read : Khaleja Scene Repeate : ఓం నమశివ జై జై జై.. గుంటూరు కారం ఈవెంట్ లో ఖలేజా సీన్ రిపీట్..!
మహేష్ తో అప్పుడు స్పెషల్ సాంగ్ చేసిన రమ్యకృష్ణ ఇప్పుడు గుంటూరు కారం సినిమాలో మదర్ రోల్ లో నటించింది. బాహుబలిలో శివగామి పాత్రతో మళ్లీ కెరీర్ లో బిజీ అయిన రమ్యకృష్ణ సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. లైగర్ తర్వాత ఆమె మహేష్ గుంటూరు కారంలో నటించింది.
సినిమాలో ఆమె పాత్ర చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. మహేష్ రమ్యకృష్ణల మధ్య సీన్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయని అంటున్నారు. సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా చేసింది. థమన్ మ్యూజిక్ సినిమాపై సూపర్ క్రేజ్ తీసుకు రాగా కుర్చీ మడతపెట్టి సాంగ్ తో మహేష్ రికార్డులన్నీ మడతపెట్టేస్తాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
https://youtu.be/2ktY0HT-ImI?si=GktipYKzL6YtBStR