Site icon HashtagU Telugu

Mahesh Rajamouli : దసరాకి మహేష్ రాజమౌళి సినిమా ముహూర్తం..?

Mahesh Rajamouli Movie Muhurtam Date Locked

Mahesh Rajamouli Movie Muhurtam Date Locked

Mahesh Rajamouli సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తాడని తెలిసిందే. కె.ఎల్ నారాయణ ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ పడుతూ వచ్చిన రాజమౌళి మహేష్ సినిమా నెక్స్ట్ ఇయర్ సెట్స్ మీదకు వెళ్తుంది. అయితే ఈ సినిమాకు ముహూర్తం మాత్రం ఈ దసరాకి పెట్టేస్తారని అంటున్నారు. దసరా సందర్భంగా రాజమౌళి మహేష్ (Mahesh) సినిమాకు ముహుర్తం పెడతారని తెలుస్తుంది.

ఈ ముహూర్తం వేడుకకు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన దర్శక నిర్మాతలు అందరు అటెండ్ అయ్యేలా భారీగా చేస్తున్నారట. దసరాకి ముహూర్తం పెట్టి త్వరలోనే సినిమా మొదటి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి (Rajamouli). సినిమాకు కనీసం రెండేళ్లు టైం తీసుకునేలా షెడ్యూల్ వేస్తున్నారు.

ఇప్పటికే సినిమాకు సంబంధించిన వర్క్ షాప్స్ మొదలు పెట్టారని తెలుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ ఎన్నాళ్ల నుంచో కోరుకుంటున్న కల త్వరలో నెరవేరబోతుంది. RRR తర్వాత రాజమౌళి చేస్తున్న మహేష్ సినిమాపై ఇంటర్నేషనల్ లెవెల్ లో అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాకు కథ విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) అందిస్తున్నారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ లో అడ్వెంచరస్ జర్నీగా ఈ సినిమా ఉంటుందని టాక్. ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.

Also Read : Priyanka Arul Mohan : పవన్ తర్వాత నానితో రొమాన్స్.. టాలీవుడ్ లో పాగా వేస్తున్న ముద్దుగుమ్మ..?