SRK and Mahesh: మహేశ్ మీతో కలిసి జవాన్ మూవీ చూడాలని ఉంది,  షారుక్ ఇంట్రస్టింగ్ ట్వీట్!

ఇది జవాన్ టైం. ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని కోరుకుంటున్నాను అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Mahesh And Sharukh

Mahesh And Sharukh

SRK and Mahesh: ఒకరు బాలీవుడ్ సూపర్ స్టార్, మరొకరు టాలీవుడ్ సూపర్ స్టార్. అలాంటి స్టార్స్ ఇద్దరు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటే ఇక అభిమానులను పండుగే. వారిద్దరే షారుక్ ఖాన్, మహేశ్ బాబు. షారుక్ హీరోగా నటిస్తున్న జవాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే షారుక్ ఖాన్ మొదటి సారి తిరుమల తిరుపతిని దర్శించుకున్నారు. జవాన్ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో  సూపర్ స్టార్ మహేష్ బాబు జవాన్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

‘ఇది జవాన్ టైం. ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని కోరుకుంటున్నాను. కుటుంబ సభ్యులతో కలిసి చూడాలని ఎదురుచూస్తున్నా” అని ట్విట్ చేశారు మహేష్. అయితే మహేష్ ట్వీట్ కి షారుఖ్ ఖాన్ వెంటనే బదులిచ్చారు. డియర్ ఫ్రెండ్.. మీరు సినిమాను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. మీరు చూస్తున్నప్పుడు నాకు చెప్పండి. మీతో కలిసి చూస్తాను” అని బదులిచ్చారు బాలీవుడ్ బాద్ షా.

పఠాన్(Pataan) మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.వేయి కోట్లు కొల్లగొట్టిన సాధించడంతో జవాన్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా చూసేందుకు ఆడియన్స్ ఎగబడుతున్నారు. ఈ క్రమంలోనే అడ్వాన్స్ బుకింగ్ లో ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరబాద్, కోల్‌కతా, చెన్నైల్లో వంటి ప్రధాన నగరాల్లో భారీ వసూళ్లు రాబడుతోంది జవాన్ మూవీ. ఈ జోరు చూస్తుంటే.. జవాన్ మూవీ భారత సినీ చరిత్రలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసేలానే కనిపిస్తుంది. జస్ట్ ఓపెనింగ్స్ తోనే గదర్2 సినిమా కలెక్షన్లను అధిగమించిందంటే జవాన్ క్రేజ్ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.

Also Read: Meenakshi Chaudhary: శ్రీలీలకు షాక్ ఇచ్చిన మీనాక్షి చౌదరి, ఎందుకో తెలుసా?

  Last Updated: 06 Sep 2023, 03:38 PM IST