టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, అలాగే దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే జనవరిలో ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తరచూ ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. ఈ సినిమాకు సంబంధించిన వినిపిస్తున్న వార్తలు ఒక్కొక్కటి సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి.
అందులో భాగంగానే ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే మహేష్ బాబు ఒడిశాలో ల్యాండ్ అయ్యారట. షూటింగ్ లో భాగంగా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ కోసం చిత్రయూనిట్ ఒడిశాలోని కోరాపుట్ ప్రాంతానికి వెళ్లిందట. దాదాపు ఇరవై రోజుల వరకు ఈ సినిమా చిత్రీకరణ అక్కడే జరుగుతుందని సమాచారం. గత ఏడాది డిసెంబరు నెల చివర్లో ఒడిశా వెళ్లి, అక్కడి ఫారెస్ట్ లొకేషన్స్ ని రాజమౌళి పరిశీలించారట. తాజాగా మూవీ మేకర్స్ బుధవారం ఒడిశా వెళ్లారట. దీంతో ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ లో వచ్చే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ల చిత్రీకరణ కూడా జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ వార్తను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. కాగా విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథ అందించగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని, తొలి భాగం 2027లో విడుదలయ్యే అవకాశం ఉందనిటాక్.