ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ఆమోదంతో 1000 కోట్ల కలెక్షన్స్ కి దూసుకెళ్తుంటే లేటెస్ట్ గా సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ కల్కి టీం పై ప్రశంసలు కురిపించాడు. కల్కి చూసిన మహేష్ (Mahesh Babu)మైండ్ బ్ల్యూ ఎవే అని కామెంట్ పెట్టాడు. ఇలాంటి ఫ్యూచరిస్టిక్ విజన్ తో సినిమా తీసిన దర్శకుడు నాగ్ అశ్విన్ కి హ్యాట్సాఫ్ అని అన్నారు. ప్రతి ఫ్రేం ఆర్ట్ లో భాగంగా ఉందని అన్నారు.
ఇక సినిమాలో నటించిన వారి గురించి చెబుతూ అమితాబ్ (Amitab Bacchan) సార్.. మీ స్క్రీన్ ప్రెజన్స్ అన్ మ్యాచబుల్.. కమల్ (Kamal Hassan) సార్ మీరు పోశించిన ఈ పాత్ర మరోసారి మీ ప్రత్యేకత తెలియచేస్తుంది. ప్రభాస్ నువ్వు మరో అద్భుతమైన పాత్ర నీ కెరీర్ లో చేశావు. దీపికా పదుకొనే (Deepika Padukone) ఎప్పటిలానే అదరగొట్టావు. విజయంతి మూవీస్ కి సినిమా యూనిట్ అందరికీ ఈ సక్సెస్ అందుకున్నందుకు కంగ్రాట్స్ అని తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు మహేష్.
మహేష్ మామూలుగా ప్రతి సినిమాకు ట్వీట్ చేయడు. తనకు బాగా నచ్చిన సినిమాల గురించే ఇలా ట్విట్టర్ స్పేస్ లో తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. కల్కి చూసిన మిగతా సెలబ్రిటీస్ ఇప్పటికే తన ప్రశంసలు కురిపించగా మహేష్ రెండో వారంలో చూసి వావ్ అనేశాడు. మహేష్ కల్కి కామెంట్స్ కచ్చితంగా సినిమా వసూళ్లను పెంచేస్తాయని చెప్పొచ్చు.
ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే రాజమౌళితో సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే సినిమా వర్క్ షాప్ మొదలవుతుందని తెలుస్తుంది. మహేష్ రాజమౌళి ఈ కాంబో ఆడియన్స్ కు నెవర్ బిఫోర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు సిద్ధమవుతున్నారు. తప్పకుండా కల్కి సినిమా చూశాక జక్క కూడా మహేష్ సినిమాను అంతకుమించి ఉండేలా ప్లాన్ చేస్తాడని చెప్పొచ్చు. మరి ఆ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.