Site icon HashtagU Telugu

Mahesh Babu : సక్సెస్ గుండెల్లో పెట్టుకోవాలి తలకి ఎక్కించుకోకూడదు.. మహేష్ అన్నది ఆ హీరోనేనా..?

Mahesh Babu New Denver Advertisement Comments Target That Hero

Mahesh Babu New Denver Advertisement Comments Target That Hero

Mahesh Babu సూపర్ స్టార్ మహేష్ సినిమాలే కాదు వాణిజ్య ప్రకటనలతో కూడా మెప్పిస్తాడు. సౌత్ లో హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్ గా యాడ్స్ ద్వారానే మహేష్ బాగా సంపాదిస్తాడు. అయితే తను యాడ్స్ ద్వారా వచ్చిన మొత్తాన్ని చిన్న పిల్లల గుండె ఆపరేషన్ కి ఖర్చు చేస్తాడు.

మహేష్ ఇప్పటికే 1500 పైగా చిన్నారుల ప్రాణాలు కాపాడాడు. ఇక వెండితెర మీద సూపర్ స్టార్ స్టామినా గురించి తెలిసిందే. రీసెంట్ గా గుంటూరు కారంతో మరోసారి అదరగొట్టిన మహేష్ నెక్స్ట్ సినిమా రాజమౌళితో చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.

Also Read : M.S.Subbalakshmi Biopic : వెండితెర సుబ్బలక్ష్మి ఎవరు.. రేసులో ఆ ముగగ్గురు భామలు..!

ఇదిలాఉంటే మహేష్ లేటెస్ట్ యాడ్ ఎవరినో టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. కంపెనీ హెడ్ ఒక ఆఫీసర్ ని లిఫ్ట్ లో తీసుకెళ్లేందుకు లిఫ్ట్ ఓపెన్ అవ్వగా అక్కడ పనిచేసే వ్యక్తి లిఫ్ట్ ఎక్కబోతాడు. అప్పుడు ఒక వ్యక్తి నువ్వు తర్వాత రా అంటాడు. అప్పుడే మహేష్ వస్తాడు.. సార్ రండి అంటాడు. కానీ మహేష్ నేను తర్వాత వస్తానని చెప్పి.. ఆ పనిచేసే వ్యక్తితో కలిసి వెళ్తాడు. డెన్వర్ డియోడ్రండ్ యాడ్ ఇది.

ఇక మెసేజ్ గా సక్సెస్ ని గుండెల్లో పెట్టుకోవాలి తలకి ఎక్కకూడదు అంటాడు మహేష్. కేవలం యాడ్ కోసమే ఈ డైలాగ్ చెప్పినట్టు అనిపించినా యాంటీ ఫ్యాన్స్ కొందరు మహేష్ డైలాగ్ ని ఒక హీరోకి అన్వహిస్తూ సోషల్ మీడియాలో హడవిడి చేస్తున్నారు. అక్కడ మహేష్ చేసింది ఒక కామన్ కామెంట్.

అయితే అది తమ హీరోనే అన్నట్టుగా చెప్పుకుంటూ కొందరు సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలు పెట్టారు. ఏది ఏమైనా యాడ్ లో మహేష్ లుక్స్ అదిరిపోయిందని చెప్పొచ్చు.