Mahesh Babu సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబో అనగానే ఫ్యాన్స్ లో ఆడియన్స్ లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. గుంటూరు కారం సినిమా విషయంలో కూడా అది నిజమైంది. అయితే శుక్రవారం రిలీజైన ఈ సినిమా టాక్ అంత గొప్పగా ఏం లేదని తెలిసిందే. మహేష్ వన్ మ్యాన్ షో తప్ప సినిమాలో చెప్పుకునే అంశాలు ఏమి లేవని అర్ధమవుతుంది. మహేష్ మాత్రం వెంకట రమణ పాత్రలో అదరగొట్టాడు. అయితే ఈ సినిమా కోసం మహేష్ రెమ్యునరేషన్ కూడా హాట్ టాపిక్ గా మారింది.
We’re now on WhatsApp : Click to Join
టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు రెమ్యునరేషన్ లో టాపు లేపుతున్నారు. ప్రభాస్ లాంటి హీరోలు 100 కోట్ల దాకా పారితోషికం అందుకుంటుంటే ఆ తర్వాత మహేష్, పవన్ లాంటి హీరోలు 70 కోట్ల దాకా ప్రతి సినిమాకు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే గుంటూరు కారం సినిమాకు మాత్రం మహేష్ 20 కోట్లు తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలుస్తుంది. అంటే ఈ సినిమాకు మహేష్ 50 కోట్లు రెమ్యునరేషన్ గా అందుకున్నాడట.
మహేష్ (Mahesh Babu) ఈ సినిమాకు ఎందుకు రెమ్యునరేషన్ తక్కువగా తీసుకున్నాడు అన్నది మాత్రం తెలియలేదు. త్రివిక్రం తో మహేష్ హ్యాట్రిక్ మూవీగ గుంటూరు కారం వచ్చింది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత లాంగ్ గ్యాప్ తర్వాత వీరిద్దరు కలిసి సినిమా చేశారు. కానీ ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో సినిమా లేదన్నది ఓపెన్ టాక్. ఆడియన్స్ కూడా ఏదో ఎక్స్ పెక్ట్ చేసి వస్తే మరేదో చూపించారని కామెంట్ చేస్తున్నారు.
Also Read : Prabhas Maruthi Movie Title : రాజా డీలక్స్ కాదు.. ప్రభాస్ మారుతి మూవీ టైటిల్ ఇదే..!
సంక్రాంతి సీజన్ కాబట్టి ఎలాగు హాలీడేస్ ఉన్నాయి.. సో మహేష్ మేనియా ప్రకారం వసూళ్లు బాగానే వచ్చే ఛాన్స్ ఉంది. అతడు, ఖలేజా తర్వాత 12 ఏళ్ల తర్వాత మహేష్ త్రివిక్రం కలిసి ఇలాంటి ఒక సినిమా చేస్తారని మాత్రం ప్రేషకులు అస్సలు ఊహించలేదు. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా త్వరలోనే గ్రాండ్ లాంచింగ్ ఉండబోతుందని తెలుస్తుంది. ఆ సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్ లో క్రేజ్ తెచ్చుకునేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు. రాజమౌళి సినిమా ఒక అడ్వెంచర్ మూవీగా వస్తుందని తెలుస్తుంది. సినిమా కాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్న జక్కన్న సినిమా సెట్స్ మీదకు వెళ్లే ముందే వర్క్ షాక్ నిర్వహించాలని చూస్తున్నారు. మహేష్ రాజమౌళి ఫ్యాన్స్ ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఈ కాంబో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.