Site icon HashtagU Telugu

Mahesh Babu Looks: కండలు పెంచిన మహేశ్.. లేటెస్ట్ ఫొటో వైరల్!

Mahesh Babu

Mahesh Babu

ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినను ఈ డైలాగ్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)కు అతికినట్టుగా సరిపోతోంది. మహేశ్ ఏదైనా సినిమాను ఒప్పుకున్నారంటే ప్రాణం పెట్టి పనిచేస్తాడు. పాత్రలో పూర్తిగా నిమగ్నమవుతాడు. ఒక్క మాటలో గా చెప్పాలంటే బ్లైండ్ గా దూసుకుపోతాడు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పేరులేని సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా కోసం ఎవరూ ఊహించని లుక్ లో కనిపించబోతున్నాడు. మహేష్ బాబు స్లీవ్‌లెస్ టీషర్టులో తన బాడీ చూపిస్తూ అందంగా కనిపించాడు. గత కొన్ని సినిమాల్లో స్టైలిష్‌, కూల్‌గా కనిపించిన మహేశ్ (Mahesh Babu)  త్రివిక్రమ్ సినిమా కోసం కొత్త లుక్‌తో మనల్ని ఆశ్చర్య పర్చబోతున్నాడు. ఇది త్రివిక్రమ్ మార్క్ పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్ అయినప్పటికీ, SSMB28లో ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయి. హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లో మహేష్ బాబు (Mahesh Babu)కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ప్రస్తుతం మహేశ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Allu Arjun Rejected: షారుఖ్ కు ‘నో’ చెప్పిన అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా!