Site icon HashtagU Telugu

Mahesh Babu : అతిథి పాత్రలో మహేష్ బాబు హీరో ఎవరంటే

Sudheer Babu Comments About Mahesh Babu Food Diet

Sudheer Babu Comments About Mahesh Babu Food Diet

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) అతిధి పాత్ర(guest role)లో కనిపించబోతున్నారు. వరుస హిట్లతో ఫుల్ స్వింగ్ లో ఉన్న మహేష్..ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) డైరెక్షన్లో ఓ యాక్షన్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. పూర్తి జుట్టు , గడ్డం తో మహేష్ ఈ మూవీ లో కనిపించబోతున్నారు. జనవరి లో ఈ మూవీ సెట్స్ పైకి రాబోతుంది. కాగా ఈ సినిమాలో కంటే ముందే మహేష్ వెండితెరపై కనిపించబోతున్నాడు.

‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) సినిమాలో మహేష్ బాబు అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన మేనల్లుడు గల్లా అశోక్ (Galla Ashok) హీరోగా నటించిన చిత్రంలో క్లైమాక్స్ లో కృష్ణుడిగా మహేష్ కనిపిస్తారని నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాకు జాంబిరెడ్డి, హ‌నుమాన్ చిత్రాల ఫేమ్ ప్ర‌శాంత్ వర్మ (Prashanth Verma) ఈ చిత్రానికి కథనందిస్తుండ‌గా.. గుణ 369 ఫేం అర్జున్‌ జంధ్యాల (Arjun Jandyala) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు రెడీ అవుతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాను న‌వంబ‌ర్ 14న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు మేక‌ర్స్. కాగా మహేశ్ పాత్రపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

ఈ సినిమాలో అశోక్‌ గల్లా సరసన హీరోయిన్‌గా మాజీ మిస్‌ ఇండియా (2020) మానస వారణాసి (Manasa Varanasi) న‌టిస్తుంది. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ (ఎన్‌ఆర్‌ఐ) ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సాయి మాధవ్‌ బుర్రా సంభాషణలు అందిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు.

Read Also : Hyderabad 144 Section : టాలీవుడ్ కు భారీ నష్టం