Mahesh Babu: మహేశ్ బాబు మెచ్చిన మేమ్ ఫేమస్.. సూపర్ స్టార్ ట్వీట్ వైరల్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబును ఓ మూవీ వీపరితంగా మెప్పించింది. ఆ మూవీ టీమ్ ను అభినందిస్తూ ట్వీట్ చేశారాయన.

Published By: HashtagU Telugu Desk
Mem Famous

Mem Famous

టాలీవుడ్ (Tollywood) లో భారీ సినిమాలతో పాటు లోకల్ ఫ్లేవర్స్ ఉన్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సుమంత్ ప్రభాస్ హీరోగా మేమ్ ఫేమస్ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ప్రమోషన్లలో కొత్త పుంతలు తొక్కుతూ అందర్నీ ఆకట్టుకుంటోంది. దీంతో ప్రముఖ నటుడు మహేష్ బాబు (Mahesh Babu) ఇటీవల “మేమ్ ఫేమస్” చిత్రంపై తన అభిప్రాయాలను షేర్ చేశారు.

సినిమా చూసిన తర్వాత “మేమ్ ఫేమస్” పై మహేశ్ బాబు పాజిటివ్ గా మాట్లాడారు. మహేష్ తన ట్వీట్ లో..ఇప్పుడే మేము ఫేమస్ సినిమా చూశాను. సినిమాలో ప్రతి ఒక్కరు తమ ట్యాలెంట్ (Talent) తో మెప్పించారు. ముఖ్యంగా హీరో, రైటర్, డైరెక్టర్ సుమంత్ ప్రభాస్ అద్భుతమైన ట్యాలెంట్. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఇంతమంది కొత్తవాళ్లతో మంచి సినిమా తీశారు. నిర్మాతలు శరత్, అనురాగ్ లకు అభినందనలు ఇలాంటి కొత్త ట్యాలెంట్ ని ప్రోత్సహిస్తున్నందుకు అని ట్వీట్ చేశారు.

కాగా ఇప్పటికే చాలామంది హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్, యాక్టర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో ఏదో ఒక రకంగా భాగం అవుతున్నారు. మే 26న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోస్ (Premier) నేడు రాత్రి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో కొన్ని సెలెక్టివ్ థియేటర్స్ లో వేస్తున్నారు.

Also Read: Tragedy Incident: చిన్నారి ప్రాణం తీసిన కారు.. హైదరాబాద్ లో హృదయ విదారక ఘటన!

  Last Updated: 25 May 2023, 02:56 PM IST