Mahesh Babu Guntur Karam Amma Song : గుంటూరు కారం అమ్మ పాట.. కాస్త లేట్ అయ్యింది కానీ ముందే వదిలుంటే..!

Mahesh Babu Guntur Karam Amma Song సూపర్ స్టార్ మహేష్ లీడ్ రోల్ లో త్రివిక్రం డైరెక్షన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమా సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్

Published By: HashtagU Telugu Desk
Mahesh Babu Guntur Karam Amma Song Release Late For Promotion

Mahesh Babu Guntur Karam Amma Song Release Late For Promotion

Mahesh Babu Guntur Karam Amma Song సూపర్ స్టార్ మహేష్ లీడ్ రోల్ లో త్రివిక్రం డైరెక్షన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమా సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో దం మసాలా, కుర్చి మడత పెట్టి సాంగ్స్ మాస్ ఆడియన్స్ కి బాగా ఎక్కేశాయి.

We’re now on WhatsApp : Click to Join

అయితే ఈ సినిమాలో అమ్మ సాంగ్ థియేటర్ లో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. సినిమాలో ఎమోషన్ ని క్యారీ చేసేలా ఈ పాట ఉంది. అయితే ఈ పాటని రిలీజ్ ముందు వదలకుండా రిలీజ్ తర్వాత రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.

రిలీజ్ తర్వాత గుంటూరు కారం ఫ్యామిలీ సినిమా అని ముందు నుంచి చెప్పకపోవడం మా తప్పే అని నిర్మాత నాగ వంశీ అన్నారు. అయితే ఈ పాటని రిలీజ్ ముందు వదిలితే అది ఆడియన్స్ కి తెలిసేది. ఇప్పుడు సినిమా రిజల్ట్ అంతా అయ్యాక ఈ సాంగ్ రిలీజ్ చేస్తే ఏమవుతుందని ఆడియన్స్ అంటున్నారు. అమ్మ సాంగ్ థియేటర్ లో ఆడియన్స్ ని మెప్పించింది. ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్ లో రిలీజైంది.

ఇక గుంటూరు కారం ఫలితం విషయానికి వస్తే మొదటి షోతో బాగాలేదు అన్న టాక్ నుంచి 200 కోట్ల పైన కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో మరోసారి మహేష్ బాబు మాస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేశాడు. ఈ సినిమాలో మహేష్ బాబు మదర్ రోల్ లో రమ్యకృష్ణ నటించారు. సినిమాలో మహేష్ నటన, డ్యాన్స్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.

Also Read : Sundeep Kishan Ooruperu BhairavakOna : భైరవ కోన టీం తో బుజ్జగింపులు.. సోలో డేట్ ఇచ్చేలా..!

  Last Updated: 27 Jan 2024, 08:16 AM IST