Kurchi MadathaPetti: కుర్చీ మడత పెట్టి సాంగ్ క్రేజ్ మాములుగా లేదుగా.. ఏకంగా అమెరికాలో?

  • Written By:
  • Publish Date - April 1, 2024 / 06:48 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీ లీల కలిసి నటించిన గుంటూరు కారం సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక ఈ సినిమా ఎంత హిట్ అయిందో అంతకంటే ముందు పాటలు బాగా హిట్ అయ్యాయి. మరి ముఖ్యంగా గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతబెట్టి సాంగ్ అయితే బాగా వైరల్ అయింది. ఈ పాట యూట్యూబ్ లో సెన్సేషన్ ను క్రియేట్ చేసింది.

యూట్యూబ్ లో మాత్రమే కాకుండా ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ ఎక్కడ చూసినా కూడా కొద్ది రోజులు ఈ పాట మారు మోగిపోయింది. కుర్చీ మడతబెట్టి అనే ఒక వైరల్ పదం తీసుకొని దాంతో స్పెషల్ సాంగ్ రాయగా థమన్ ఇచ్చిన ఫాస్ట్ మ్యూజిక్ బీట్స్, శ్రీలీల, మహేష్ సినిమాలో వేసిన స్టెప్పులకు థియేటర్స్ దద్ద రిల్లాయి. థియేటర్స్ లో మహేష్, శ్రీలీల మాస్ స్టెప్పులు చూసి అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఆ స్టెప్పులు కూడా వైరల్ అవ్వడంతో బయట, ఈవెంట్స్ లో, కాలేజీ ఫంక్షన్స్ లో, రీల్స్ లో ఎక్కడ చూసినా కుర్చీ మడతబెట్టి స్టెప్పులు సందడి చేసాయి.

ఇది ఇలా ఉంటే ఈ కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ కి ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీలు టాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే. ఇండియాలో వేరే రాష్ట్రాల్లో పలు కాలేజీ ఈవెంట్స్ లో ఈ సాంగ్ ని తెగ వాడేస్తూ స్టెప్పులేస్తున్నారు. ఇప్పుడు ఈ పాట అమెరికా దాకా పాకింది. అమెరికాలో కూడా కుర్చీ మడతబెట్టేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా హూస్టన్ లో నేషనల్ బాస్కెట్ బాల్ గేమ్స్ జరుగుతున్నాయి.

 

ఈ గేమ్స్ మధ్యలో బ్రేక్ టైంలో పలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేయగా ఒక గేమ్ మధ్యలో ఇలా పలువురు అమెరికన్స్ కుర్చీ మడతపెట్టి సాంగ్ కి ఒక రేంజ్ లో స్టెప్పులేసి అలరించారు. ఇంకేముంది ఈ వీడియో వైరల్ గా మారింది. గుంటూరు కారం మూవీ యూనిట్ తమ సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోని పోస్ట్ చేసింది. ఇక మహేష్ అభిమానులు అయితే ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు. కుర్చీ మడతపెట్టి సాంగ్ కూడా నాటు నాటు లాగే మరింత వైరల్ అవుతుందని మహేష్ అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.