Site icon HashtagU Telugu

Venkatesh -Mahesh Babu : పేకాట ఆడుతూ ఎంజాయ్ చేస్తున్న వెంకీ – మహేష్

Venky Mahesh Rummy2

Venky Mahesh Rummy2

సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు (Seethamma Vakitlo Sirimalle Chettu) మూవీ లో అన్నదమ్ములుగా వెంకటేష్ – మహేష్ బాబు (Venkatesh -Mahesh Babu) లు నటించి అభిమానులను , ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. ఈ మొవేయి తర్వాత మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటూ వస్తున్నారు. కానీ దానికి తగ్గ కథను ఎవరు సెట్ చేయడం లేదు. ఇదిలా ఉంటె తాజాగా వీరిద్దరూ కలిసి మరోసారి కనిపించారు. అది కూడా పేకాట ఆడుతూ (Play Cards ).. వీరిద్దరూ కలిసి ఒక ప్రైవేట్ పార్టీ (Private Event)కి హాజరయ్యారు.

 

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో అక్కడ సరదాగా టైం పాస్ కోసం పేకాడగా అక్కడే ఉన్న ఎవరో దానిని క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో పెట్టడంతో అది విపరీతంగా వైరల్ అవుతుంది. వెంకీ – మహేష్ చేతిలో కార్డ్స్ ఉంటే, వారి ముందు టేబుల్ పైన రూ.500 నోట్లు గుంపుగా పడేసి కనిపించాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఇటీవల వెంకటేష్ కూతురి ఎంగేజ్మెంట్ జరగగా.. ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, మహేష్ బాబు మాత్రమే హాజరయ్యారు. ఆ నిశ్చితార్థం వేడుకలోని వెంకీ- మహేష్ ఫోటోలు చూసి అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. ఇక ఇప్పుడు ఇలా పేకాట ఆడుతున్న పిక్ తెగ సంబరపెడుతుంది.

Read Also : Guntur Kaaram : గుంటూరు కారం నుండి అసలైన ప్రోమో వచ్చేసింది