Madhuri Dixit Mother: బాలీవుడ్ లో మరో విషాదం.. మాధురి దీక్షిత్‌ తల్లి కన్నుమూత

సతీష్ కౌశిక్ మరణం తర్వాత బాలీవుడ్ నుంచి మరో బ్యాడ్ న్యూస్ బయటకు వచ్చింది. ప్రముఖ బాలీవుడ్​ నటి మాధురి దీక్షిత్‌ (Madhuri Dixit)​ ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి స్నేహలత దీక్షిత్​ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

Published By: HashtagU Telugu Desk
Madhuri Dixit

Resizeimagesize (1280 X 720) (5) 11zon

సతీష్ కౌశిక్ మరణం తర్వాత బాలీవుడ్ నుంచి మరో బ్యాడ్ న్యూస్ బయటకు వచ్చింది. ప్రముఖ బాలీవుడ్​ నటి మాధురి దీక్షిత్‌ (Madhuri Dixit)​ ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి స్నేహలత దీక్షిత్​ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషాదకర వార్తను మాధురి దీక్షిత్​ దంపతులు ట్విట్టర్​ ద్వారా తెలిపారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మాధురీ దీక్షిత్ తల్లి ఆదివారం ఉదయం 8.40 గంటలకు కన్నుమూశారు. నటి తల్లి వయస్సు 91 సంవత్సరాలు. ఆమె తల్లి అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 3 లేదా 4 గంటలకు ముంబైలోని వర్లీలో నిర్వహించనున్నారు. మాధురీ దీక్షిత్ తన తల్లికి చాలా సన్నిహితంగా ఉండేది.

Also Read: Rajinikanth: రాజకీయాలకు దూరమైంది అందుకే.. కారణం చెప్పిన రజనీకాంత్‌..!

మాధురీ దీక్షిత్ గత ఏడాది జూన్‌లో తన తల్లి 90వ పుట్టినరోజును జరుపుకుంది. తన తల్లి పుట్టినరోజును జరుపుకుంటున్న చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంది. తన తల్లితో జ్ఞాపకాన్ని పంచుకుంటూ నటి క్యాప్షన్‌లో ఇలా రాసింది. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా! తల్లి కూతురికి బెస్ట్ ఫ్రెండ్ అని అంటారు. అవి నిజంగా సరైనవే. నువ్వు నా కోసం చేసినవన్నీ, నాకు నేర్పిన పాఠాలే నువ్వు నాకు ఇచ్చిన గొప్ప బహుమతి. నేను నీకు మంచి ఆరోగ్యం, ఆనందాన్ని మాత్రమే కోరుకుంటున్నాను అని మాధురి దీక్షిత్ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. మాధురీ దీక్షిత్ కెరీర్ ప్రారంభ రోజుల్లో తల్లి ఆమెకు చాలా సపోర్ట్ చేసింది. సినిమా షూటింగ్ అయినా, ఏదైనా ఈవెంట్ అయినా ఆమె తల్లి ఎప్పుడూ మాధురితోనే ఉండేది. స్టార్‌ అయినప్పటికీ సాధారణ జీవితాన్ని గడపడంలో తన తల్లిది పెద్ద హస్తం అని నటి చాలాసార్లు చెప్పింది.

  Last Updated: 12 Mar 2023, 12:28 PM IST