‘మ్యాడ్’ (MAD) చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘మ్యాడ్ స్క్వేర్’ (MAD Square)భారీ అంచనాల నడుమ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా, శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించారు. పార్ట్ 1 లో ఎలాగైతే కామెడీ అందరినీ ఆకట్టుకుందో..సెకండ్ పార్ట్ కూడా అంతే విధంగా కామెడీ ఉందని ఆడియన్స్ చెపుతుండడం తో సినిమాను చూసేందుకు సినీ లవర్స్ థియేటర్స్ కు పరుగులు పెడుతున్నారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది.
Amit Shah : బడ్జెట్‌పై చర్చల్లో 42 శాతం సమయం ఆయనకే ఇచ్చారు: అమిత్ షా
తొలిరోజు ఈ మూవీ భారీగా వసూళ్లు రాబట్టినట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. మొదటిరోజు ఏకంగా రూ.17 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. బ్రేక్ ఈవెన్ విలువ రూ.45 కోట్లు కాగా తొలిరోజే 40శాతం రికవరీ చేసినట్లు వెల్లడించాయి. లాంగ్ వీకెండ్ కావడం, వరుస సెలవులు ఉండడం తో భారీగా కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలో వచ్చిన ‘మ్యాడ్’ చిత్రం రూ.8 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకొని బాక్సాఫీస్ వద్ద రూ.26 కోట్లను రాబ్టగలిగింది. అంటే ‘మ్యాడ్ స్క్వేర్’ తొలిరోజే రూ.17 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం బాక్సాఫీస్ వద్ద మచి పరిణామంగా మారింది. ప్రస్తుతం థియేటర్లలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘L2 : ఎంపురాన్’, నితిన్ రాబిన్ హుడ్, విక్రమ్ వీర ధీర శూర.. చిత్రాలు థియేటర్లలో పార్లల్ గా రన్ అవుతున్నాయి. వీటితో పోటి పడి మరి ‘మ్యాడ్ స్క్వేర్’ వసూళ్లు రాబడుతుండటం ఆసక్తికరంగా మారింది.