‘మ్యాడ్’ (MAD) చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘మ్యాడ్ స్క్వేర్’ (MAD Square)భారీ అంచనాల నడుమ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా, శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించారు. పార్ట్ 1 లో ఎలాగైతే కామెడీ అందరినీ ఆకట్టుకుందో..సెకండ్ పార్ట్ కూడా అంతే విధంగా కామెడీ ఉందని ఆడియన్స్ చెపుతుండడం తో సినిమాను చూసేందుకు సినీ లవర్స్ థియేటర్స్ కు పరుగులు పెడుతున్నారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది.
Kodali Nani: కొడాలి నాని ఆరోగ్యంపై కీలక అప్డేట్.. ముంబైకి తరలింపు!
ముఖ్యంగా ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్లను క్రాస్ చేసి రేర్ రికార్డ్ క్రియేట్ చేసింది.మ్యాడ్ స్క్వర్ మొదటి రోజు 20 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టింది. రెండ్రోజుల్లో 37 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. మూడో రోజు అయితే డే వన్ కంటే ఎక్కువగా వచ్చినట్టుగా సమాచారం. అలా మ్యాడ్ స్క్వేర్ మూడు రోజుల్లో 55 నుంచి 60 కోట్ల వరకు రాబట్టి ఉంటుందని టాక్. మ్యాడ్ స్క్వేర్ కలెక్షన్స్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.