Site icon HashtagU Telugu

MAA Notices: NTR విగ్రహ వివాదంలో కరాటే కల్యాణికి షోకాజ్ నోటీసులు

MAA Notices

New Web Story Copy 2023 05 17t192317.903

MAA Notices: తెలుగు సినిమా పరిశ్రమలో వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది నటి కరాటే కళ్యాణి. ప్రతి విషయంలో తలదూరుస్తూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది. మొన్నటికి మొన్న ఓ యూట్యూబర్ ని రోడ్డుమీద కొడుతూ వీరంగం సృష్టించింది. ఇక ఆమెపై అనేక ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇదంతా పక్కనేడితే తాజాగా ఈ నటి మరో వివాదంలో ఇరుక్కుంది. సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం మీద కామెంట్స్ చేసి మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది.

రాష్ట్ర అధికార పార్టీ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఖమ్మంలో ప్రతిష్టించాలనుకుంది. అయితే ఆ విగ్రహం శ్రీకృష్ణుడి పోలికలతో రూపొందించారు. దీంతో ఎన్టీఆర్ విగ్రహ నమూనాపై కరాటే కళ్యాణి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో ప్రతిష్టించడం శ్రీకృష్ణ భగవానుడిని అవమానించడమేనని, ఇది చాలా హేయమైన చర్యగా పేర్కొన్నది. యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ నాయకురాలిగా దీనిని వెంటనే ఆపేయాలని కరాటే కల్యాణి డిమాండ్ చేసింది. దీంతో ఈ వివాదం మా అసోసియేషన్ వరకు వెళ్ళింది.

క్రమశిక్షణ ఉల్లంఘన కిందా ఆమెకు మా (MAA) అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) షోకాజ్ నోటీసులు పంపారు. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. వివరణ ఇవ్వని పక్షంలో కఠినంగా నిర్ణయాలు తీసుకుంటామని విష్ణు హెచ్చరించాడు. దీంతో కరాటే వివాదంపై చర్చ జరుగుతుంది. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారె కళ్యాణి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని తప్పుబడుతూ కామెంట్స్ చేసింది. మరోవైపు కరాటే కళ్యాణి చేసిన ఆరోపణలపై కొందరు మండిపడుతున్నారు. సినిమాలు లేక, చేసేదేం లేక ఇలాగైనా పబ్బం గడపాలి అనుకుంటున్నారా కళ్యాణి గారు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొందరు ఆమె చేసిన పనిని సమర్ధిస్తే మెజారిటీగా విమర్శిస్తున్నారు.

Read More: Salman Khan Sister: సల్మాన్ చెల్లెలి ఇంట్లో చోరీ: ఇంటిదొంగే