Site icon HashtagU Telugu

Lokesh Kanagaraj : కమల్ & రజిని మల్టీస్టారర్.. ఇద్దరికీ కథ చెప్పిన లోకేష్ కనగరాజ్..

Lokesh Kanagaraj Plans Huge Multistarrer Film with Kamal Haasan and Rajinikanth

Rajinikanth Kamal Haasan

Lokesh Kanagaraj : తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సినిమాలపై మంచి అంచనాలే ఉంటాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ మొదలుపెట్టి వరుస హిట్స్ కొట్టి తన రాబోయే సినిమాలపై కూడా అంచనాలు పెంచాడు. ప్రస్తుతం లోకేష్ రజినీకాంత్ తో కూలీ సినిమా చేస్తున్నాడు. అది అయ్యాక కార్తీతో ఖైదీ 2 చేయనున్నాడు. ఆల్రెడీ కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా చేసాడు.

అయితే లోకేష్ కనగరాజ్ తమిళ్ స్టార్స్ అయిన రజినీకాంత్ – కమల్ హాసన్ ని పెట్టి భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడట. గతంలో కెరీర్ ఆరంభంలో రజినీకాంత్ – కమల్ హాసన్ కలిసి పలు సినిమాలు చేసారు. నేషనల్ వైడ్ స్టార్ డమ్ వచ్చాక ఈ ఇద్దరూ కలిసి సినిమాలు చేయలేదు. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ వీళ్ళిద్దర్నీ కలపడానికి ప్రయత్నిస్తున్నాడు.

ఆల్రెడీ లోకేష్ కమల్, రజినీలకు మల్టీస్టారర్ కథ ఒకటి చెప్పాడంట. అది కూడా గ్యాంగ్ స్టర్ కథే. లోకేష్ చెప్పిన కథ ఇద్దరికీ నచ్చిందట. కూలి సినిమా అయ్యాక ఆ కథని ఫైనలైజ్ చేసి మరోసారి ఇద్దరికీ వినిపిస్తాడట. ఇద్దరూ ఓకే అంటే ఇండియా మొత్తం ఎదురుచూసే సీనియర్ హీరోల భారీ మల్టీస్టారర్ వచ్చేసినట్టే. కాకపోతే కాస్త టైం మాత్రం పడుతుంది. మరి రజిని – కమల్ కలిసి సినిమా అంటే ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తాడో లోకేష్ చూడాలి. ఫ్యాన్స్ కూడా ఈ కాంబో కోసం ఎదురుచూస్తున్నారు.

Also Read : Sumanth : పాత ఫొటోని పట్టుకొని ఎంత పని చేశారు.. మృణాల్ తో ఫొటో.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సుమంత్..