Lishi Ganesh-Drugs Case : డ్రగ్స్‌ కేసులో ప్రముఖ నటి పేరు నమోదు..

  • Written By:
  • Publish Date - February 26, 2024 / 10:17 PM IST

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. సోమవారం గచ్చిబౌలి(Gachibowli )లోని రాడిసన్‌ హోటల్‌(Radisson Hotel) ఫై పోలీసులు దాడి జరుపగా.. భారీగా డ్రగ్స్‌ దొరికాయి. డ్రగ్స్ తీసుకుంటున్న బిజెపి నేత(Politician) కుమారుడు గజ్జల వివేకానందతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి హోటల్‌లో నిర్వహించిన విందు కార్యక్రమంలో వారంతా డ్రగ్స్(Drugs) వినియోగించినట్టు తెలుస్తోంది. హోటల్‌లో గజ్జల వివేకానంద కొందరికి విందు ఏర్పాటు చేేేసి.. ఈ పార్టీలో డ్రగ్స్ వాడినట్టు తెలుసుకున్న పోలీసులు దాడి చేసి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో బీజేపీ నేత కుమారుడు సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. 2009లో శేరిలింగంపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన యోగానంద్ కుమారుడు వివేకానంద. ఆ హోటల్ కూడా యోగానంద్‌దేనని తెలుస్తోంది. అయితే గత 3 రోజులుగా ఈ ముగ్గురు యువకులు పార్టీ చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఈ డ్రగ్స్‌ కేసులో పోలీసులు నటి లిషి గణేష్‌ (Lishi Ganesh) పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఈమెతో పాటు ఈమె సోదరి పేర్లు గతంలో కూడా డ్రగ్స్ వ్యవహారంలో వినిపించాయి. వీరిని పిలిచి విచారిస్తామని పోలీసులు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

లిషి గణేష్ విషయానికి వస్తే.. యూట్యూబర్‌గా పాపులరైన ఈమె.. కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌లోనూ నటించింది. జియోమెట్రీ బాక్స్‌ లాంటి షార్ట్‌ ఫిల్మ్‌తో నటిగా ఆమె ఓ గుర్తింపు తెచ్చుకుంది. కాగా 2022లో కూడా ఈమె పేరు డ్రగ్స్ కేసులో వినిపించింది. అప్పుడు మింక్‌ పబ్‌ డ్రగ్‌ కేసు సంచలనం రేపింది. అందులో లిషితో పాటు ఆమె సోదరి కుషిత పేరు కూడా వినిపించింది. ఆ సమయంలో కుషిత ఆ ఆరోపణల్ని ఖండిస్తూ చీజ్‌ బజ్జీలు తినడానికి వెళ్లామంటూ చెప్పుకొచ్చింది. అప్పుడు ఆమెను నెటిజన్లు బాగా ట్రోల్‌ చేశారు. ఇప్పుడు ఆమె సోదరి లిషి గణేష్‌ పేరు రాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో వినిపించడం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. లిషితో పాటు శ్వేత అనే వీఐపీ పేరును ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు చేర్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటె రాడిసన్‌ హోటల్‌ యజమాని యోగానంద్ కి అల్లు అరవింద్ తనయుడు, స్టార్ హీరో అల్లు అర్జున్‌ సంబంధాలు ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా పోలీస్ విచారణలో ప్రముఖుల పేర్లు బయటికి వచ్చేలా కనిపిస్తోంది. చూద్దాం ఈ కేసు ఎక్కడివరకు వెళ్తుందో..ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో..!!

Read Also : Singareni Insurance Scheme : సింగరేణి కార్మికులకు రేవంత్ ప్రభుత్వం తీపి కబురు