Lingu Swamy : కమల్ హాసన్ వల్ల కోట్లలో నష్టం వచ్చింది.. సినిమా చేస్తానని ఇప్పటికి చేయలేదు..

ఇటీవల ఓ తమిళ్ యూట్యూబ్ ఛానల్ ఈ సినిమా లింగుస్వామికి భారీ ప్రాఫిట్స్ తీసుకొచ్చిందని ప్రచారం చేసింది. దీంతో ఈ వార్త లింగు స్వామి వరకు వెళ్లడంతో అధికారికంగా దీనిపై తిరుపతి బ్రదర్స్ నిర్మాణ సంస్థ నుంచి ఓ ప్రెస్ నోట్ ఇచ్చారు.

Published By: HashtagU Telugu Desk
Lingu Swamy Sensatiional Comments on Kamal Haasan

Lingu Swamy Sensatiional Comments on Kamal Haasan

Lingu Swamy : ఆనందం, ఆవారా, పందెంకోడి.. లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి మెప్పించారు దర్శకుడు లింగు స్వామి. కానీ ఇటీవల వరుస ఫ్లాప్స్ లో ఉన్నారు. అంతేకాకుండా వరుస వివాదాల్లో కూడా నిలుస్తున్నారు. లింగుస్వామి, అతని సోదరుడితో కలిసి తిరుపతి బ్రదర్స్ అని ఓ నిర్మాణ సంస్థని కూడా స్థాపించి సినిమాలు నిర్మించారు.

ఈ క్రమంలో కమల్ హాసన్(Kamal Haasan) హీరోగా 2015లో ఉత్తమ విలన్ అనే ఓ సినిమాని తీశారు. ఆ సినిమా పరాజయం పాలయి తిరుపతి బ్రదర్స్ నిర్మాణ సంస్థకి భారీ నష్టం తీసుకొచ్చింది. అయితే ఇటీవల ఓ తమిళ్ యూట్యూబ్ ఛానల్ ఈ సినిమా లింగుస్వామికి భారీ ప్రాఫిట్స్ తీసుకొచ్చిందని ప్రచారం చేసింది. దీంతో ఈ వార్త లింగు స్వామి వరకు వెళ్లడంతో అధికారికంగా దీనిపై తిరుపతి బ్రదర్స్ నిర్మాణ సంస్థ నుంచి ఓ ప్రెస్ నోట్ ఇచ్చారు.

ఇందులో.. కమల్ హాసన్ హీరోగా మా సంస్థలో నిర్మించిన ఉత్తమ విలన్ సినిమా వల్ల మేము ఆర్ధికంగా భారీగా నష్టపోయాం. సినిమా చూసి ఫైనల్ కాపీలో మేము కొన్ని మార్పులు చేసాము. కానీ కమల్ వాటిని పట్టించుకోలేదు. ఆ సినిమా మాకు భారీగా నష్టం వచ్చింది. దీంతో కమల్ మాకు 30 కోట్ల బడ్జెట్ లో ఒక సినిమా చేసిస్తానని మాటిచ్చారు. కథలు చెప్పినా వారం వారం కథ మార్చేసేవారు. కనీసం దృశ్యం రీమేక్ అయినా మా సంస్థలో చేయమన్నాము కానీ చేయలేదు. మాకు కమల్ హాసన్ ఒక సినిమా చేయాలి అని అన్నారు. దీంతో లింగు స్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. మరి కమల్ ఇప్పట్లో అసలు లింగుస్వామికి సినిమా చేస్తాడా చూడాలి.

 

Also Read : Pawan Kalyan : బాబోయ్ పవన్ కూతురు కూడా ఏంటి ఇంత హైట్ అయ్యిపోయింది.. వీడియో వైరల్..

  Last Updated: 19 Apr 2024, 03:50 PM IST