Site icon HashtagU Telugu

Laila Movie : ఓటిటిలోకి విశ్వక్ సేన్ లైలా

Laila Movie Censor

Laila Movie Censor

యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) నటించిన తాజా చిత్రం ‘లైలా’ (Laila ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ హీరోగా పేరు దక్కించుకున్న ఈయన తొలిసారి ఇందులో లేడీ పాత్రలో నటించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై యువ నిర్మాత సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీ లో విశ్వక్ సేన్ సరసన ఆకాంక్ష శర్మ జోడి కాగా కామాక్షి భాస్కర్ల, వెన్నెల కిషోర్, హర్షవర్ధన్, బ్రహ్మాజీ, బబ్లూ పృథ్వీ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు.

Daggubati Venkateswara Rao : 30 ఏళ్ల తరువాత కలిసిన తోడళ్లుల్లు

టీజర్ , ట్రైలర్ కాస్త బాగుండడం తో సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని వెళ్లిన అభిమానులకు , ప్రేక్షకులు డైరెక్టర్ భారీ షాక్ ఇచ్చాడు. కథ లో కొత్తదనం కాదు కదా..కనీసం ఇది ఓ స్టోరీ అని కూడా చెప్పలేనంత చెత్తగా రాసుకొని ప్రేక్షకులను భయపెట్టాడు. మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకొని , రెండు రోజులకే థియేటర్స్ నుండి వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు ఓటిటి లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ నెల 14న వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్స్ లోకి వచ్చిన ఈ మూవీ… మార్చి 7 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ చేయబోతున్నారు. మూమాలుగా అయితే 30 లేదా 45 రోజుల తర్వాతే ఓటిటిలో విడుదల చేస్తారు. అది రూల్ కూడా. ఇలాంటి మూవీస్ కు అలాంటి రూల్స్ వర్తించవు. అందుకే నెల తిరిగేలోపే వచ్చేసింది. మరి ఓటిటిలో ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.