Lavanya Tripathi : వరుణ్ తేజ్(Varun Tej) ని ప్రేమించి పెళ్లి చేసుకొని లావణ్య త్రిపాఠి మెగా కోడలు అయింది. ఇక మెగా కోడలు అంటే సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. వరుణ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి లావణ్య ఏం చేసినా, ఏ పోస్ట్ పెట్టిన వైరల్ అవుతూనే ఉంటుంది. ఇటీవలే వరుణ్, లావణ్య ఓ ఫారిన్ ట్రిప్ కి కూడా వెళ్లొచ్చారు.
తాజాగా లావణ్య త్రిపాఠి తన అత్తయ్య, వరుణ్ తల్లి పద్మజతో కలిసి ఆవకాయ పెడుతున్న ఫొటో వైరల్ అవుతుంది. ఉపాసన, చిరంజీవి భార్య సురేఖ కలిసి ఇటీవల అత్తమ్మస్ కిచెన్(Athammas Kitchen) అని ఓ ఫుడ్ బిజినెస్ స్థాపించిన సంగతి తెలిసిందే. దీంతో రెగ్యులర్ గా ఆ సంస్థ సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ కోడళ్ళు, అత్తలతో ఉన్న ఫోటోలు ఏదో ఒకటి షేర్ చేస్తూ ఉంటారు.
ఇటీవల చిరంజీవి భార్య సురేఖ కొణిదెల ఆవకాయ పచ్చడి పెట్టిన వీడియో షేర్ చేయగా తాజాగా లావణ్య త్రిపాఠి, నాగబాబు భార్య పద్మజ కలిసి ఆవకాయ పచ్చడి తయారుచేస్తున్న ఫొటో షేర్ చేసారు. అలాగే నాగబాబు భార్య పద్మజ, ఆమె అత్తమ్మ అంజనమ్మ కలిసి దిగిన ఫొటో కూడా షేర్ చేశారు. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. కొత్త కోడలు ఇంట్లో బాగా కలిసిపోయి అందరితో సరదాగా కలిసి పని చేస్తుంది అని లావణ్యని అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు.
Also Read : Nagababu – Allu Arjun : నాగబాబు ట్వీట్ అల్లు అర్జున్‌కేనా.. మావాడైన పరాయివాడే..