Site icon HashtagU Telugu

Lavanya Tripathi : నీ పెళ్లికి చిరంజీవి వస్తాడా.. లావణ్య సినిమాలో డైలాగ్ ఇలా నిజమైంది..!

Lavanya Tripathi Nee Pelliki Chiranjeevi Vastada Dialogue In Andala Rakshasi

Lavanya Tripathi Nee Pelliki Chiranjeevi Vastada Dialogue In Andala Rakshasi

Lavanya Tripathi నిన్నటిదాకా తెలుగు హీరోయిన్ గా ఉన్న లావణ్య త్రిపాఠి ఇప్పుడు మెగా కోడలిగా ప్రమోషన్ కొట్టేసింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) తో లావణ్య త్రిపాఠి మ్యారేజ్ ఇటలీలో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ పెళ్లికి మెగా ఫ్యామిలీ మొత్తం అటెండ్ అయ్యింది.

చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాం చరణ్, అల్లు అర్జున్, సాయి ధరం తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, నాగ బాబు, ఇలా అందరు మెగా హీరోలంతా కూడా వరుణ్ తేజ్ పెళ్లిలో సందడి చేశారు.

అయితే లావణ్య త్రిపాఠి పెళ్లికి చిరంజీవి (Chiranjeevi) రావడం ప్రత్యేకంగా మారింది. అదేంటి నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్ పెళ్లికి చిరంజీవి రాకపోతే ఎలా అనుకోవచ్చు. ఇంటి పెద్దగా చిరంజీవి రావడం కామనే కానీ చిరంజీవి లావణ్య త్రిపాఠి పెళ్లికి వెళ్లడం ఇది 11 ఏళ్ల క్రితం వచ్చిన లావణ్య సినిమాలో నీ పెళ్లికి చిరంజీవి వస్తాడా అంటే అవుననే తల ఊపుతుంది లావణ్య.

Also Read : Rakul Preet Singh : అలాంటి రాత్రులు గడిపా.. ఏది అంత ఈజీగా రాదంటున్న రకుల్..!

లావణ్య నటించిన అందాల రాక్షసి (Andala Rakshasi) సినిమాలో పెళ్లికి రెడీ అవుతుంది. ఆ టైం లో నీ పెళ్లికి సినిమా యాక్టర్లు వస్తారా చిరంజీవి కూడా వస్తాడా అంటే అవును అని చెబుతుంది. అదే నిజం చేస్తూ ఇప్పుడు ఏకంగా మెగా ఇంటి కోడలిగా మారి చిరంజీవే పెళ్లి పెద్దగా తన మ్యారేజ్ జరిగేలా చేసుకుంది.

ఆ మధ్య ఒక సినిమా ఈవెంట్ లో అల్లు అరవింద్ (Allu Aravind) కూడా ఇక్కడే ఓ అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో అనగానే వరుణ్ తేజ్ నే పెళ్లాడింది. మొత్తానికి లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీ సభ్యురాలిగా కొత్త జర్నీ మొదలు పెట్టింది.

We’re now on WhatsApp : Click to Join