Lavanya Tripathi: పెళ్లికళ వచ్చేసిందే బాలా, మెగా కోడలు శారీ పిక్స్ వైరల్

స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌ ధరించి, లైట్‌ బ్లూ కలర్‌ ప్రింటెడ్‌ శారీలో హోయలు పోయింది మెగా కోడలు.

Published By: HashtagU Telugu Desk
Lavanya

Lavanya

లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్‌తో తన నిశ్చితార్థం అయిన ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. త్వరలోనే ఈ బ్యూటీ మెగా ఇంట్లోకి అడుగుపెట్టబోతోంది. వెండితెరపై ఆమె కనిపించడం తగ్గిపోయినప్పటికీ, ఇంటర్నెట్‌లో ఆమె ఉనికిని చాటుకుంటోంది. ఇటీవలి ఫోటోషూట్‌లో లావణ్య సొగసైన మరియు ఆకట్టుకునే చీరను ధరించి నెటిజన్స్ ను తనవైపు తిప్పుకుంటోంది. చీరకట్టులోనూ సొగసైన అందాలను ప్రదర్శించింది.

పెళ్లి కళ ఆమెలో ఉట్టిపడినట్టుగా కనిపిస్తోంది. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌ ధరించి, లైట్‌ బ్లూ కలర్‌ ప్రింటెడ్‌ శారీలో హోయలు పోయింది. మెడలో పెద్ద హారం ధరించి పోజులిచ్చింది. నిషా ఎక్కించే కళ్లతో కుర్రాళ్లకి మత్తెక్కిస్తుంది లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం ఈ అమ్మడు పంచుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. `అందాల రాక్షసి` తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ చాలా సెలక్టీవ్‌గానే సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో వరుణ్‌ తేజ్‌తో `మిస్టర్‌` చిత్రంలో నటించింది. ఈ మూవీతోనే ఇద్దరు ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. అయితే చాాలా రోజులుగా డేటింగ్ లో ఉన్నప్పటికీ పెళ్లికి ముందు ఆసలు విషయం బయటపెట్టింది ఈ జంట.

Also Read: Vande Bharat: హైదరాబాద్-బెంగళూరు మధ్య నడిచే వందే భారత్ టికెట్ ధర ఎంతో తెలుసా?

  Last Updated: 22 Sep 2023, 12:07 PM IST