Latha Rajinikanth : రజినీకాంత్ పాలిటిక్స్ లోకి రానందుకు బాధపడ్డా.. రజినీకాంత్ భార్య ఆసక్తికర వ్యాఖ్యలు..

రజినీకాంత్ కూడా గతంలో రాజకీయాల్లోకి వస్తానని చెప్పి ఫ్యాన్స్ తో మీటింగ్స్ కూడా పెట్టారు. కానీ ఏమైందో తెలీదు ఆ తర్వాత రాజకీయాల్లోకి రాను అని అధికారికంగానే ప్రకటించారు

  • Written By:
  • Publish Date - December 27, 2023 / 07:30 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) తన స్టైల్, సినిమాలతో, బయట సింప్లిసిటీతో కోట్లల్లో అభిమానులను సంపాదించుకున్నారు. 70 ఏళ్ళు వచ్చినా ఇంకా అదే స్టైల్, స్వాగ్ తో సినిమాలు చేస్తున్నారు. మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా రజినీకాంత్ కి భారీగా అభిమానులు ఉన్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని చాలా మంది భావించారు. అభిమానులు కూడా ఆయన్ని రాజకీయాల్లోకి రమ్మని కోరారు.

రజినీకాంత్ కూడా గతంలో రాజకీయాల్లోకి వస్తానని చెప్పి ఫ్యాన్స్ తో మీటింగ్స్ కూడా పెట్టారు. కానీ ఏమైందో తెలీదు ఆ తర్వాత రాజకీయాల్లోకి రాను అని అధికారికంగానే ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు నిరాశ చెందారు. తాజాగా రజినీకాంత్ పాలిటిక్స్ ఎంట్రీపై ఆయన భార్య లతా రజినీకాంత్ మాట్లాడారు.

ఓ కేసు విషయంలో లతా రజినీకాంత్(Latha Rajinikanth) నేడు కోర్టుకి వెళ్లారు. కేసు పని పూర్తయ్యాక వెళ్లిపోతుండగా మీడియాతో కేసు గురించి, అలాగే పలు విషయాలు మాట్లాడారు. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు రజినీకాంత్ పాలిటిక్స్ ఎంట్రీ గురించి అడగడంతో ఆమె స్పందించారు. లతా రజినీకాంత్ మాట్లాడుతూ.. ఆయన పాలిటిక్స్ లోకి రానందుకు నేను చాలా బాధపడ్డాను. ఆయన్ని నేను ఒక లీడర్ లా చూశాను. కానీ ఆయన పాలిటిక్స్ లోకి రానందుకు ఒక బలమైన కారణమే ఉంది అని అన్నారు. అయితే ఆ కారణం ఏంటి అని చెప్పలేదు.

ఇక లతా రజినీకాంత్ గతంలో కొచ్చాడియాన్ సినిమా నిర్మాణం సమయంలో నిర్మాతలు వేరే వాళ్ళ దగ్గర డబ్బులు అప్పు తీసుకుంటే హామీ సంతకం పెట్టారు. వాళ్ళు డబ్బులు చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన సంస్థ లతా రజినీకాంత్ పై కేసు పెట్టారు. ఈ కేసుకు సంబంధించి బెయిల్ విషయంలో ఆవిడ కోర్టులో హాజరయ్యారు. కోర్టు కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసింది.

 

Also Read : Meera Chopra : 40 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకోబోతున్న పవన్ ‘బంగారం’ హీరోయిన్..