AI Songs : ఏఐతో ‘లాల్‌ సలామ్‌’ పాటలు.. బాలు గొంతుతో పాడించమంటున్నారన్న రెహమాన్

AI Songs :  ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) టెక్నాలజీ పాటల తోటలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

  • Written By:
  • Updated On - February 5, 2024 / 08:10 AM IST

AI Songs :  ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) టెక్నాలజీ పాటల తోటలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ ప్రయోగానికి వేదికను ఇచ్చింది ఎవరో తెలుసా ? ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ !!  రజనీకాంత్‌ కీలక పాత్రలో తెరకెక్కుతున్న ‘లాల్‌ సలామ్‌’ మూవీలో ఈ ప్రయోగం చేశానని ఆయన వెల్లడించారు.  ఏఐ టెక్నాలజీని వాడుకొని దివంగత గాయకులు బంబా బక్యా, షాహుల్‌ హమీద్‌లతో పాట పాడించానన్నారు. ‘‘దురదృష్టవశాత్తు ఈ ఇద్దరు మెగా సింగర్స్  చిన్నవయసులోనే చనిపోయారు. వారిపై ఉన్న అభిమానంతోనే.. వారి స్వరాలను ‘తిమిరి ఎళుడా..’ అనే పాటతో ఏఐ ద్వారా వినిపించేందుకు సిద్ధమయ్యాను. ఇలా చేయడం సినిమా చరిత్రలోనే తొలిసారి. ఇందుకోసం బక్యా, హమీద్ కుటుంబాల అనుమతి తీసుకున్నాం.  తగినంత పారితోషికం కూడా ఇచ్చాం. వాళ్ల గొంతు మళ్లీ సినిమాలో వినపడుతుందని తెలియగానే ఇరు కుటుంబాల చాలా సంతోషపడ్డాయి’’ అని ఎ.ఆర్‌.రెహమాన్‌ వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘‘జీన్స్‌’, ‘కాదలన్‌’ లాంటి సినిమాలలో హమీద్‌ పాటలు పాడారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రంలో ‘పొన్ని నది’, రజనీకాంత్‌ ‘రోబో 2.0’లో ‘కాలమే కాలమే’ పాటలను బక్యా ఆలపించారు’’ అని వివరించారు. ‘‘కొత్త టెక్నాలజీని వాడే ముందు దానికి పూర్తి న్యాయం చేయగలమనే నమ్మకం కుదిరినప్పుడే ఆ సాంకేతికను ఉపయోగించుకోవాలి. ఏమాత్రం తేడా వచ్చినా పూర్తిగా నెగెటివ్ ఎఫెక్టు చూపిస్తుంది’’ అని రెహమాన్ తెలిపారు. ఇప్పుడు చాలామంది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సర్‌ గొంతును రీ క్రియేట్‌ చేయమని అడుగుతున్నారని.. దాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏఐ టెక్నాలజీ సాయంతో గతంలో ఎన్నో పాటలకు నాకు సహకరించిన నా స్నేహితుల స్వరాలను తిరిగి తీసుకొస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు.

Also Read : Benzine Bells : హైదరాబాద్‌లో ‘బెంజీన్’ డేంజర్ బెల్స్.. ఎంత అనర్ధమో తెలుసా ?

కువైట్, ఖతర్ దేశాల్లో బ్యాన్

రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణు విశాల్ , విక్రాంత్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా లాల్ సలామ్. స్పోర్ట్ బేస్డ్ గా రూపొందుతున్న ఈ చిత్రం  మత కల్లోల కథాంశం ప్రధానం. ఈసినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ కొన్ని పనులు ఇంకా పెండింగ్ లో ఉండటంతో రిలీజ్ డేట్ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈనేపథ్యంలోనే  ఫిబ్రవరి 9వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కు రిలీజ్ సమస్యలు ఎదురౌతున్నాయి. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రాన్ని కువైట్ లో బ్యాన్ చేశారు.  కువైట్, ఖతర్ దేశాలు సినిమాల రిలీజ్ పరంగా చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నాయి. అక్కడ సినిమాలు బ్యాన్ చేయడానికి కారణం అందులో ఉన్న కంటెంట్. ఆయా దేశాల్లో సినిమాలపై చాలా ఆంక్షలు ఉంటాయి. ఏ మాత్రం కంటెంట్ తేడాగా ఉన్నా వెంటనే దాన్ని బ్యాన్ చేస్తుంటాయి అక్కడి ప్రభుత్వాలు.ఈ క్రమంలో లాల్ సలాం చిత్రం లో సెన్సిటిల్ కాన్సెప్టు ఇందని, హిందూ,ముస్లిం ఘర్షణలు కు సంబంధించింది కావటంతో బ్యాన్ చేసినట్లు సమాచారం. మిడిల్ ఈస్ట్ లో కూడా ఇలాంటి సెన్సిటివ్ సినిమాలు సెన్సార్ కష్టమే అంటున్నారు.