Site icon HashtagU Telugu

Manchu Manoj & Lakshmi : మనోజ్ ను ఆలా చూసి కన్నీరు పెట్టుకున్న మంచు లక్ష్మి

Manoj Lakshmi

Manoj Lakshmi

మంచు ఫ్యామిలీ(Manchu Family)లో గత కొంతకాలంగా జరుగుతున్న ఫ్యామిలీ వివాదాలు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మంచు మనోజ్ – మోహన్ బాబు – విష్ణు (Manoj vs Vishnu) మధ్య జరుగుతున్న గొడవలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో మంచు లక్ష్మి (Manchu Lakshmi) – మనోజ్ కలవడం..ఒక్కసారి ఎమోషనల్ గా మారాయి.

Kailasapatnam : బాణసంచా ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

మంచు లక్ష్మీ శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఓ ఫ్యాషన్ ఈవెంట్‌లో తమ్ముడు మనోజ్‌ను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. సెలబ్రిటీ ఫ్యాషన్ షో సందర్భంగా మంచు లక్ష్మీ స్టేజ్‌పై ఉన్న సమయంలో ఆమె సోదరుడు మనోజ్ సడెన్‌గా తన భార్య మౌనికతో కలిసి అక్కడికి వెళ్లాడు. స్టేజ్ వెనుకవైపు నుండే లక్ష్మీ దగ్గరకు వెళ్లిన మనోజ్‌ను చూసిన క్షణంలోనే ఆమె ఎమోషనల్ అయ్యి కళ్లల్లో కన్నీళ్లతో తమ్ముడిని ఆలింగనం చేసుకుంది. అక్కడున్న ప్రేక్షకులంతా ఈ దృశ్యాన్ని చూసి ఎమోషనలకు గురయ్యారు. ఈ అక్కతమ్ముళ్ల అనుబంధం చూపించే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా “ఇది మన కుటుంబ బంధాలకు అద్దం పడుతుంది” అంటూ హృదయంగా కామెంట్లు పెడుతున్నారు.